BigTV English
Advertisement

Bubblegum Review: రోషన్ కనకాల.. “బబుల్ గమ్” ప్రేక్షకులకు అతుక్కుందా ?

Bubblegum Movie Review

Bubblegum Review: రోషన్ కనకాల.. “బబుల్ గమ్” ప్రేక్షకులకు అతుక్కుందా ?
Bubblegum movie Review

Bubblegum movie Review(Tollywood movie reviews):

2023.. సినీ క్యాలెండర్ ముగుస్తోంది. ఇంకా రెండ్రోజుల్లో న్యూ ఇయర్ వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ రెడీ అవుతున్నారు. ఈ ఏడాది చివరి రోజుల్లో టాలీవుడ్ లో రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఒకటి కల్యాణ్ రామ్ డెవిల్.. మరొకటి బబుల్ గమ్. ఈ సినిమాతో రాజీవ్ – సుమ కనకాల దంపతుల కొడుకు రోషన్ కనకాల వెండితెరకు హీరోగా పరిచయం అయ్యాడు. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీలా చిత్రాలతో తానెంటో చెప్పిన రవికాంత్ పేరేపు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వంటి పెద్దనిర్మాణ సంస్థ నిర్మించిన ఈ సినిమా.. రోషన్ కు తొలి హిట్ ఇచ్చిందో లేదో చూద్దాం.


సినిమా : బబుల్ గమ్

నటీనటులు : రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్థన్, అనుహాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి తదితరుల


డైరెక్టర్ : రవికాంత్ పేరెపు

కథ : రవికాంత్ పేరెపు, విష్ణు కొండూరు, సెరి-గన్ని

సంగీతం : శ్రీచరణ్ పాకాల

నిర్మాణం : మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

సినిమాటోగ్రఫీ : సురేష్ రగుతు

రిలీజ్ డేట్ : 29-12-2023

కథ

ఆది అలియాస్ ఆదిత్య (రోషన్ కనకాల) హైదరాబాద్ కు చెందిన సాటి మిడిల్ క్లాస్ కుర్రాడు. డీజే అవ్వాలన్న లక్ష్యంతో ఉంటాడు. ఒక పార్టీలో జాను అలియాస్ జాన్వీ (మానస చౌదరి)ని చూసి ఇష్టపడతాడు. ఆమె పెద్దింటి అమ్మాయి. ఆధునిక జీవన శైలికి అలవాటుపడిన ఆమెకు ప్రేమ, పెళ్లి లాంటి ఎమోషన్స్ పై నమ్మకం ఉండదు. అబ్బాయిలను ఆడుకునే బొమ్మల్లా చూసే జాన్సీ.. ఆది డీజీ ప్లే చేసే తీరు నచ్చి ఇష్టపడుతుంది. తర్వాత అతడి వ్యక్తిత్వం నచ్చి మరింత క్లోజ్ అవుతుంది.

జాన్వీ తనకే తెలియకుండా ఆదితో ప్రేమలో పడిపోతుంది. ఒక పార్టీలో జాను ఫ్రెండ్ చేసిన ఒక పని వారిద్దరి మధ్య గొడవకు కారణమవుతుంది. ఆ పార్టీలోనే ఆదిని దారుణంగా అవమానిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది ? జాను చేసిన అవమానాన్ని ఆది ఎలా తీసుకున్నాడు? రెండు భిన్న నేపథ్యాలు కలిగిన వీరి ప్రేమ చివరికి ఏ తీరానికి చేరింది ? ఆది కల నెరవేరిందా ? అన్నదే మిగతా స్టోరీ. ఇదంతా తెలియాలంటే.. తెరపై ఒకసారి సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

బబుల్ గమ్ సినిమా.. పూర్తిగా యువతరం..నేటితరం లక్ష్యంగా తీసిన చిత్రం. కథా నేపథ్యం కొత్తేమీ కాదు. ఇంటర్వెల్, క్లైమాక్స్ మినహా మిగతా స్టోరీ అంతా చాలా రొటీన్ గా ఉంటుంది. హీరో హీరోయిన్ మధ్య ప్రేమ, వాళ్లిద్దరి మధ్య రిలేషన్ ను చూస్తే ఏమాత్రం కొత్తగా కనిపించదు. హీరో డ్రీమ్, ఫ్యామిలీ వాతావరణం చూస్తే.. డీజే టిల్లు సినిమానే గుర్తొస్తుంది.

ఆది-జానుల పరిచయం. వారిద్దరి మధ్య ప్రేమ, ఇద్దరూ దగ్గరవ్వడం వంటి వాటిలో ఎమోషన్స్ పెద్దగా కనిపించవు. వీరి లవ్ ట్రాక్ కు ప్రేక్షకులు ఎమోషనల్ గా అటాచ్ అవ్వరని ఖచ్చితంగా చెప్పొచ్చు. పైగా రొమాంటిక్ సీన్స్ చూస్తే.. ప్రేమకంటే మోహమే ఎక్కువగా ఉన్నట్లు సాటి ప్రేక్షకుడికి అనిపిస్తుంది. యువతకు ఈ సినిమా నచ్చుతుందేమో కానీ.. మిగతా ప్రేక్షకులకు మాత్రం సహనానికి పరీక్షనే చెప్పాలి. ఇంటర్వెల్ కు ముందు వచ్చే సీన్స్ మాత్రం.. సెకండాఫ్ పై కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. ప్రేయసి చేతిలో అవమానం తర్వాత.. తన లక్ష్యం దిశగా హీరో అడుగులు వేసే తీరు మెప్పిస్తుంది.

ఇక సెకండాఫ్ లో హీరోయిన్ పాత్ర.. నటనకు ఇంపార్టెన్స్ ఉన్నదిగా కనిపిస్తుంది. తన తప్పు తెలుసుకున్న జాను.. ఆది ప్రేమ కోసం పడే ఆరాటం, అతని ఇంటికెళ్లి చేసే ప్రయత్నాలు ఫర్వాలేదనిపిస్తాయి. క్లైమాక్స్ మాత్రం యువతకు చిన్న సందేశమిచ్చేలా ఉంటుంది.

ప్లస్ పాయింట్స్

  • రోషన్, మానస నటన
  • తండ్రి,కొడుకుల ట్రాక్
  • సెకండాఫ్ లో డ్రామా
  • క్లైమాక్స్

మైనస్ పాయింట్స్

  • రొటీన్ స్టోరీ
  • ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించే ఫస్ట్ హాఫ్

చివరిగా.. బబుల్ గమ్.. ప్రేక్షకులను థియేటర్లకు అతుక్కునేలా చేయడం కష్టమేనేమో..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×