E-Paper
Advertisement

RRR Movie : ఓటీటీలో కి వచ్చేసిన ‘RRR’ బిహైండ్ & బియాండ్.. ఎక్కడ చూడొచ్చంటే..?

RRR Movie : ఓటీటీలో కి వచ్చేసిన ‘RRR’ బిహైండ్ & బియాండ్.. ఎక్కడ చూడొచ్చంటే..?

RRR Movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లని హీరోలుగా పెట్టి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మకమైన మల్టీస్టారర్ చిత్రం RRR గురించి అందరికి తెలుసు.. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో పాటుగా కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. రాజమౌళి తెరకేక్కించిన బాహుబలి తర్వాత ఆ రికార్డుల ను బ్రేక్ చేసింది. ఆ మూవీస్ తర్వాత గ్లోబల్ లెవెల్లో సంచలనం సెట్ చేసిన ఈ చిత్రం రికార్డ్ వసూళ్లు అంతకు మించిన గౌరవాన్ని తెలుగు సినిమాకి పట్టుకొచ్చింది.. ఈ మూవీ జపాన్ లో ఇటీవలే రిలీజ్ అయ్యింది. అక్కడ కూడా కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది.. అయితే తాజాగా ఈ మూవీ డాక్యూమెంటరీ మూవీ ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసింది ట్రిపుల్ ఆర్ టీమ్.. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఎక్కడ ఎక్కడా ఈ మూవీని చూడొచ్చునో ఒకసారి చూద్దాం..

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌ పై తెరకెక్కిన ఈ సినిమా 2021లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వడమే కాకుండా ఆస్కార్ అవార్డు ను సైతం అందుకుంది.. ఈ మూవీ ఇప్పటికి కొన్ని దేశాల్లో రికార్డులు సొంతం చేసుకుంటుంది అంటే రాజమౌళి ఎలా తెరకేక్కించారో అర్థమవుతుంది. అయితే ఈ సినిమా ఇంతటి విజయాన్ని అందుకోవడం వెనక ఉన్న కష్టాన్ని డాక్యుమెంటరీ రూపంలో తెరకెక్కిస్తున్నారు. RRR బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’ పేరుతో ఈ డాక్యుమెంటరీ తెరకెక్కిస్తున్నారు. ఇక ఓటీటీలో రిలీజ్ అవుతున్న ఈ డాక్యుమెంటరీ విడుదల డేట్ లాక్ చేసుకుంది..

ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన మేకింగ్ పై ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని మేకర్స్ మొదట థియేటర్స్ లో వదిలిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఫైనల్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి RRR బిహైండ్ అండ్ బియాండ్ అంటూ సాగే ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు రిలీజ్ కి తీసుకొచ్చేసారు. థియేటర్ల లో చూడలేమనుకున్న వారు ఓటీటీ లో చూసి ఎంజాయ్ చెయ్యండి. నెట్ ఫ్లిక్స్ లో నిన్న అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ మూవీ తర్వాత ఈ చిత్రంలో నటించిన హీరోలు గ్లోబల్ స్టార్స్ అయ్యారు. ప్రస్తుతం ఇద్దరు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ దేవర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు బాలీవుడ్ లో వార్ 2 మూవీ చేస్తున్నారు. అటు రామ్ చరణ్ కూడా వరుస సినిమాలు చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు.. భారీ అంచనాల తో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..  ఆ తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబుతో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్ తో మూవీ చేస్తున్నాడు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×