BigTV English

S.Shankar: గేమ్ ఛేంజర్ ఫ్లాప్.. ఆ హీరోపై దృష్టి పెట్టిన శంకర్..?

S.Shankar: గేమ్ ఛేంజర్ ఫ్లాప్.. ఆ హీరోపై దృష్టి పెట్టిన శంకర్..?

S.Shankar:కోలీవుడ్ టాప్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శంకర్ (Shankar ) సినిమాలంటే ఒకప్పుడు ఎంతో క్రేజ్ ఉండేది. చిన్న సన్నివేశానికైనా భారీ బడ్జెట్, హుందాతనం ఉట్టిపడతాయి. అంతేకాదు శంకర్ సినిమాలు అంటే ఒక ప్రత్యేక మార్కు కూడా ఉండేది. ఒక ఆయన సినిమా వస్తోందంటే చాలు ప్రేక్షకులు కూడా థియేటర్స్ కి క్యూ కట్టేవారు. అటు ‘ రోబో ‘వరకు శంకర్ దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. కానీ ఈ మధ్యకాలంలో ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమాలు పూర్తిగా డిజాస్టర్ గా మిగులుతున్నాయి. ముఖ్యంగా రోబో తర్వాత వచ్చిన ప్రతి సినిమా కూడా డిజాస్టర్ గానే నిలుస్తోంది. అటు రోబో 2 సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.


వరుస ఫ్లాప్ లు మూట కట్టుకుంటున్న శంకర్..

దీనికి తోడు గత ఏడాది విడుదలైన ‘ఇండియన్ 2’ కూడా నిరాశపరిచింది. దాదాపు 22 ఏళ్ల క్రితం వచ్చిన ‘ఇండియన్’ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. దీనికి తోడు ఇప్పుడు ఇండియన్ 3 కూడా రాబోతున్నా .. పెద్దగా అంచనాలు లేవు. ముఖ్యంగా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్ చరణ్ (Ram Charan) ఏకంగా గ్లోబల్ రేంజ్ అందుకున్నారు. అలాంటి ఈయన శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ (Game Changer) అంటూ ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన సినిమా మాత్రం దారుణంగా నిరాశపరిచింది. దాదాపు రూ.500 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత మరుసటి రోజు నుంచే ఈ సినిమా ఊసే ఎత్తలేదు ఆడియన్స్. ఇక ఇలా వరుస సినిమాలు డిజాస్టర్ అవడంతో ఈయనకు అవకాశాలు లభిస్తాయా ? ఒకవేళ ఈయనకు ఛాన్స్ ఇస్తే ఎవరు అంత సాహసం చేస్తారు? అనే అనుమానాలు కూడా అటు ఆడియన్స్ లో బాగా తలెత్తాయి.


శంకర్ చేతిలో విక్రమ్ కొడుకు భవిష్యత్తు..

ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ డిజాస్టర్ తర్వాత శంకర్ దృష్టి విక్రమ్ (Vikram) కుమారుడు ధృవ్ విక్రమ్ (Dhruv vikram) పై పడిందని సమాచారం. తాజాగా ఆయనతో సినిమా చేస్తున్నట్లు వార్తలు రాగా కోలీవుడ్ లో ఇప్పుడు ఇదే వైరల్ టాపిక్ గా మారింది. శంకర్ గతంలో విక్రమ్ తో అపరిచితుడు ఐ సినిమాలు చేశాడు. ఇప్పుడు ఆయన కొడుకుతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా విక్రమ్ తన కొడుకును శంకర్ చేతిలో పెట్టి రిస్క్ చేస్తున్నాడని అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. మరి శంకర్ పై పెట్టుకున్న విక్రమ్ నమ్మకానికి శంకర్ ఏ విధంగా న్యాయం చేస్తాడో చూడాలి.

ధృవ్ విషయానికి వస్తే..

ధృవ్ విషయానికి వస్తే.. నటుడి గానే కాకుండా గాయకుడిగా, గీతా రచయితగా మంచి పేరు సొంతం చేసుకున్నారు 2019లో ‘ఆదిత్య వర్మ’ అనే సినిమాతో నటుడిగా అరంగేట్రం చేసిన ఈయన 2022లో తన తండ్రి విక్రమ్ తో కలిసి ‘మహాన్’ అనే సినిమాలో నటించారు. ముఖ్యంగా తన సినిమాలో నటించడమే కాకుండా పాటలు పాడుతూ ఆకట్టుకుంటున్న ధృవ్ విక్రమ్, ఇతర హీరోల సినిమాలలో కూడా పాటలు పాడుతూ ఆకట్టుకుంటున్నారు. ఇక ప్రస్తుతం శంకర్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×