Sabari Movie: వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా శబరి. అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించారు. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో 2024లో విడుదలైంది. దాసరి ఫిలిం అవార్డు 2025 లో ఈ సినిమాకు అరదైన గౌరవం దక్కింది. ఆ వివరాలు చూద్దాం
ఉత్తమ కథా చిత్రం..
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో కొత్త కథలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. కొత్త కాన్సెప్ట్ తో తీసే సినిమాలు ప్రేక్షకులు కథ నచ్చితే ఆదరిస్తారని మరోసారి రుజువైంది. వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ పాత్రలో వచ్చిన చిత్రం శబరి. తాజాగా దాసరి ఫిలిం అవార్డు 2025లో ఉత్తమ కథా చిత్రంగా శబరి అవార్డును సాధించింది. ఒక తల్లి తన బిడ్డను రక్షించేందుకు ఒంటరిగా పోరాటాన్ని ఎలా సాగించింది. బిడ్డని ఎలా రక్షించింది అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లింగ్ కథాంశంతో, ఉత్ఖండ భరితమైన సన్నివేశాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
కొత్త దర్శకుడు ,నిర్మాత ..
దాసరి ఫిలిం అవార్డు అందుకోవడానికి నిర్మాత మహేంద్ర కూండ్ల, అనిల్ రావిపూడి, సాయికుమార్, సుమన్ మురళీమోహన్, చేతుల మీదుగా ఈ అవార్డుని అందుకున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు,నిర్మాత కొత్తవారు కావడం విశేషం. 2024 మే నెలలో ఈ చిత్రం ధియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన పొందింది. అయినా కథ నిర్మాణం విలువలు, ఒక తల్లి తన బిడ్డ కోసం పడే తపన ఒంటరి పోరాటం అవార్డు లభించడానికి ఓ కారణంగా, దాసరి అవార్డు కమిటీ ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రంలో, గణేష్ వెంకట్రామన్ ,శశాంక్, గోపి, సునయన, బేబీ కార్తీక, రాజశ్రీ నాయక్ తదితరులు నటించారు. ఈ సినిమాకు అవార్డు రావడంతో అభిమానుల నుండి సెలబ్రిటీల వరకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఆ అవార్డులు వారి ని ప్రోత్సహించటానికి ..
దాసరి ఫిలిం అవార్డు ఫిలిం (FAAS) ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం హైదరాబాదులో నిర్వహించబడే ప్రతిష్టాత్మక సినీ అవార్డు కార్యక్రమం. అవార్డులను చలనచిత్ర పరిశ్రమలో వివిధ భాగాల్లో ఉత్తమ ప్రతిభను కనపరిచిన వారిని గుర్తించి సన్మానించడానికి ఏర్పాటు చేస్తారు. అవార్డులు ప్రముఖ దర్శకుడు నిర్మాత నటుడు అయిన దాసరి నారాయణరావు పేరు మీద ఏర్పాటు చేయబడింది.FAAS ద్వారా స్థాపించబడిన అవార్డులు స్థానిక కళాకారులు మరియు సాంకేతిక నిపుణులను ప్రోత్సహించడానికి అందిస్తారు. ఈ కార్యక్రమం సాధారణంగా హైదరాబాదులోనే జరుగుతుంది, పరిశ్రమలోని ప్రముఖులు సినీ పెద్దలు ఈ వేడుకలో పాల్గొంటారు. తాజాగా శబరి చిత్రం 2024లో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా అవార్డును అందుకుంది.ఈమూవీ ప్రస్తుతంప్రముఖ ఓటీటీ ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ,ప్రముఖ సీనియర్ నటులు రాజేద్రప్రసాద్,సుమన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Sharwanand: సంక్రాంతి ఫార్ములాతో శర్వానంద్.. పక్కా షూర్ షాట్ గురు