Sharwanand: టాలీవుడ్ ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా Sharwa38 రూపొందుతున్న విషయం తెలిసిందే.. సంపత్ నంది ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. గమ్యం సినిమాతో టాలీవుడ్ లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్, వరుసగా సినిమాలు చేస్తూ అభిమానుల్ని అలరిస్తున్నారు. గత సంవత్సరం మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఆశించినంత స్థాయిలో సక్సెస్ ని అందుకోలేదు. ఇప్పుడు సంపత్ నంది కాంబినేషన్ లో మూవీ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టైటిల్ ను, షూటింగ్ అప్డేట్ నుమేకర్స్ విడుదల చేశారు. వివరాలలోకి వెళితే ..
సంక్రాంతి ఫార్ములాతో శర్వానంద్..
టాలీవుడ్ డైరెక్టర్ సంపత్ నంది రామ్ చరణ్ రచ్చ, రవితేజ బెంగాల్ టైగర్ వంటి బ్లాక్ మాస్టర్ చిత్రాలతో టాలీవుడ్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఒదేల 2 మూవీతో ప్రేక్షకుల్ని పలకరించారు. తమన్నా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఇక తాజాగా ఆయన తదుపరి చిత్రం శర్వానంద్ తో ప్రకటించారు. భోగి అనే పేరు ను ఈ చిత్రానికి ప్రకటించారు. ఈ మూవీ పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా మన ముందుకు రానుంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రూపొందుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది. ఈ చిత్రానికి బీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభమైనట్లు మూవీ టీం ప్రకటించింది. ఇక శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా కావడంతో అభిమానులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ఈ మూవీ టైటిల్ గ్లిమ్స్ వీడియో ఆకట్టుకుంటుంది. సంక్రాంతి వచ్చిన శతమానం భవతి సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది.. ఇప్పుడు అదే ఫార్ములాతో ఈ సినిమా కూడా సంక్రాంతికి విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. అలా అయితే శర్వా హిట్ కొట్టటం పక్క అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మరోసారి కామినేషన్ రిపీట్ ..
సంపత్ నంది చిత్రాలు హై యాక్షన్, ఎమోషనల్ డ్రామాలుగా మాస్ అప్పీల్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇటీవల ఓదెల సీక్వెల్ తో తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఓదెల 2. ఈ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. ఇప్పుడు సంపత్ నంది అసలు అన్ని శర్వానంద్ సినిమా పైనే వున్నాయి. ఇక శర్వానంద్ 2008లో వచ్చిన గమ్యం సినిమాతో నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, రాధ, మహానుభావుడు, పడి పడి లేచే మనసు, జాను, వంటి సినిమాలలో నటించి మెప్పించారు. శర్వానంద్ హీరోగా అనుపమ హీరోయిన్ గా శతమానం భవతి అంటూ 2017 లో వచ్చినచిత్రం బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. మరోసారి వీరు భోగి సినిమాతో మన ముందుకు రానున్నారు. ఈ చిత్రం శర్వానంద్ కు, సంపత్ నంది కి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Mahesh Babu : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మహేష్ బాబు.. ఏంటి జక్కన్న ఇది..!
It’s #BHOGI
A BLOOD FEST 🤗https://t.co/HhhjvkXdzuLet’s kill it @IamSampathNandi @anupamahere @DimpleHayathi @KKRadhamohan @KirankumarMann4 @SriSathyaSaiArt pic.twitter.com/tG764M0GfD
— Sharwanand (@ImSharwanand) April 30, 2025