AP Ship – Pamban Bridge: తమిళనాడు క్రెడిట్ ను ఏపీ కొట్టేసింది. పాపం తమిళులు అంటూ సోషల్ మీడియా మార్మోగుతోంది. ఔను.. ఇదైతే నిజమే అయినప్పటికీ, ఏపీ ఆ క్రెడిట్ కొట్టేయడం ఇప్పుడు చరిత్రలో నిలిచిందని చెప్పవచ్చు. అయితే ఈ క్రెడిట్ మాత్రం ఏపీకి లైఫ్ లాంగ్ దక్కినట్లే. ఇంతకు తమిళనాడును కాదని, ఏపీకి దక్కిన ఆ క్రెడిట్ ఏమిటో తెలుసుకుందాం.
సొమ్ము తమిళనాడుదే..
భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరం ద్వీపాన్ని భూమితో కలిపే ఒక చారిత్రాత్మక రైల్వే వంతెన ఇటీవల నిర్మించిన విషయం తెలిసిందే. ఈ వంతెనను స్వయంగా ప్రధానమంత్రి మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ బ్రిడ్జి ప్రత్యేకతలు తెలుసుకుంటే ఔరా అనేస్తారు. దీని పేరే పంబన్. ఇప్పుడు దేశ వ్యాప్తంగా పంబన్ బ్రిడ్జి తెలియని వారు ఉండరు. ఈ బ్రిడ్జి భారతదేశంలో నిర్మించబడిన మొట్టమొదటి సముద్ర వంతెనగా రికార్డు సృష్టించింది.
ప్రత్యేకతలు ఇవే..
పంబన్ బ్రిడ్జ్ ఒక క్యాంటిలీవర్ టెక్నాలజీ ద్వారా నిర్మించబడింది. ఇందులో ఒక లిఫ్ట్-స్పాన్ భాగం ఉంది. ఇది షిప్పులు, బోట్లు వెళ్లగలిగేలా సెంట్రల్ సెక్షన్ ఎత్తి పెడుతుంది. ఈ బ్రిడ్జి143 పిలర్స్ మీద నిలుస్తుంది. ఈ వంతెన నిర్మాణానికి మాల్టా నుంచి ఇంజనీర్లు వచ్చి నిర్మించినట్లు తెలుస్తోంది. రైలు ప్రయాణం సమయంలో బ్రిడ్జి సాధారణంగా ఉంటుంది. ఆ తర్వాత నౌకలు, పడవలు వస్తే చాలు బ్రిడ్జి రెండు వైపులా పైకి లేచి వాటికి దారిని ఇస్తుంది.
క్రెడిట్ కొట్టేసిన ఏపీ..
తమిళనాడులో ఉన్న పంబన్ బ్రిడ్జిని దాటిన క్రెడిట్ ను మాత్రం ఏపీ కొట్టేసింది. బ్రిడ్జి ప్రారంభం అనంతరం ఎటువంటి పడవలు రాకపోకలు సాగలేదు. అదే సమయంలో తొలిసారిగా ఏపీకి చెందిన సరకుల నౌక దాటింది. వైజాగ్ నుంచి ఏప్రిల్ 16న బయల్దేరిన ‘4 స్టార్’ అనే సరకుల నౌక పంబన్ రైల్వే వంతెన దాటి కర్ణాటక కార్వార్ హార్బర్కు వెళ్లాల్సింది. కాగా, నౌక బయల్దేరిన రోజు నుంచి బంగాళాఖాతంలో బలమైన ఈదురుగాలుల కారణంగా ఏప్రిల్ 23 చేరుకోవాల్సిన 4 స్టార్ మే1వ తేదీన చేరుకుంది.
ఇటీవల తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో చారిత్రక పంబన్ బ్రిడ్జి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ వంతెనను తొలిసారిగా ఏపీకి చెందిన సరకుల నౌక దాటింది. వైజాగ్ నుంచి ఏప్రిల్ 16న బయల్దేరిన 4 స్టార్ అనే సరకుల నౌక పంబన్ రైల్వే వంతెన దాటి కర్ణాటక కార్వార్ హార్బర్‌కు వెళ్లాల్సి ఉంది.
Also Read: Indonesia Rituals: శవాలతో మాటలు, పలకరింపులు.. వీరెక్కడి మనుషులు బాబోయ్..
కాగా, నౌక బయల్దేరిన రోజు నుంచి బంగాళాఖాతంలో బలమైన ఈదురుగాలుల కారణంగా ఏప్రిల్ 23 చేరుకోవాల్సిన 4 స్టార్ నౌక మే1వ తేదీన చేరుకుంది. మొత్తం మీద తమిళనాడు నౌకలకు దక్కాల్సిన క్రెడిట్ ను వైజాగ్ నౌక కొట్టేసింది. దీనితో సోషల్ మీడియాలో పంబన్ బ్రిడ్జి దాటిన ఏపీ నౌక అంటూ నెటిజన్స్ మార్మోగిస్తున్నారు. అలాగే ఈ రికార్డ్ మళ్లీ ఎవరూ తిరగ రాయలేరని, మొత్తం మీద క్రెడిట్ ఏపీ కొట్టేసిందని నెటిజన్స్ అభిప్రాయం.