BigTV English

Sai Dharam Tej New Movie: సాయిధ‌ర‌మ్ తేజ్ కొత్త సినిమా.. రేసులో ఇద్ద‌రు హీరోయిన్స్‌

Sai Dharam Tej New Movie: సాయిధ‌ర‌మ్ తేజ్ కొత్త సినిమా.. రేసులో ఇద్ద‌రు హీరోయిన్స్‌

Sai Dharam Tej New Movie : సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్ త‌ర్వాత ఆచి తూచి సినిమాల‌ను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ ఏడాది విడుద‌లైన విరూపాక్ష సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించ‌ట‌మే కాదు.. వంద కోట్ల హీరోగా మారారు ఈ మెగా క్యాంప్ హీరో. ఇప్పుడు మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌తో మ‌న ముందుకు రానున్నారు. ఆ సినిమా ఏదో కాదు.. బ్రో. ఈ సినిమాలో మేన‌మామ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి న‌టించారు. జూలై 28న ఈ చిత్రం రిలీజ్ అవుతుందనే సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావ‌చ్చింది.


మ‌రి బ్రో త‌ర్వాత సాయిధ‌ర‌మ్ చేయ‌బోయే సినిమా ఏంట‌నే దానిపై అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మొక‌టి తెలిసింది. అదేంటంటే.. టాలీవుడ్‌లో క‌మ‌ర్షియ‌ల డైరెక్ట‌ర్‌గా పేరున్న సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో సాయిధ‌ర‌మ్ సినిమా చేయ‌బోతున్నారు. ఈ చిత్రానికి ‘గాంజా శంకర్’ అనే టైటిల్‌ను కూడా అనుకున్నారట ద‌ర్శ‌కుడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్‌లోనే ఈసినిమాను సంప‌త్ నంది రూపొందించ‌నున్నారు.

సంప‌త్ నంది సినిమాల్లో ఇద్ద‌రు హీరోయిన్స్ ఉంటారు. సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమాలోనూ అదే పంథాలో ఇద్ద‌రు హీరోయిన్స్ క‌నిపించ‌నున్నారు. అందులో మెయిన్ హీరోయిన్ కోసం ఇద్ద‌రు హీరోయిన్స్‌తో మేక‌ర్స్ సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ట‌. ఆ ఇద్ద‌రూ ఎవ‌రో కాదు.. ఒక‌రేమో శ్రీలీల.. మ‌రొక‌రు పూజా హెగ్డే. ఇద్ద‌రు బిజీ హీరోయిన్సే. అయితే ప్ర‌స్తుతం శ్రీలీల వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంది. ఆమె కంటే పూజా హెగ్డేనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని టాక్ న‌డుస్తోంది. మ‌రి రెండో హీరోయిన్‌గా ఎవ‌రు క‌నిపిస్తార‌నే ఇప్ప‌టికైతే స‌స్పెన్స్‌. జూలై నుంచే సినిమా సెట్స్ పైకి వెళుతుందని కూడా అంటున్నారు మరి.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×