Sai Pallavi Dance at the marriage function of her sister puja Kannan: ఫిదా సినిమాతో అభిమానులను ఫిదా చేసింది సాయి పల్లవి. ఈటీవీ లో వచ్చిన ఓ డ్యాన్స్ షోతో పాపులర్ అయింది. స్కూల్ డేస్ నుంచే మోడరన్, క్లాసికల్ డ్యాన్సులు స్టేజీపై నిర్భయంగా చేసేది. తమిళనాడుకు చెందిన సాయి పల్లవి తండ్రి కస్టమ్స్ అధికారి.తల్లి శాస్త్రీయ నృత్యంలో మంచి నర్తకి. తల్లి స్ఫూర్తితోనే నాట్యం నేర్చుకున్నానని చాలా సందర్భాలలో సాయి పల్లవి చెప్పింది. సాయి పల్లవి సోదరి పూజ కన్నన్. ఇద్దరూ కవలలు. సాయి పల్లవి ఎనిమిదవ తరగతి చదువుతుండగా స్టేజ్ షోలో ఈమె ఇచ్చిన నాట్య ప్రదర్శనకు ముగ్ధుడైన దర్శకుడు ధూం ధాం అనే తమిళ మూవీలో బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ పక్కన సైడ్ క్యారెక్టర్ గా అవకాశం ఇచ్చాడు.
మొదట్లో సైడ్ క్యారెక్టర్లు
మొదట్లో హీరోయిన్ కు స్నేహితురాలి క్యారెక్టర్లు చేసే సాయిపల్లవిని తమిళ దర్శకుడు ఆల్ఫోన్సా ప్రేమ మ్ మూవీలో అవకాశం ఇచ్చాడు. ఆ మూవీ సూపర్ హిట్ అయింది. జార్జియాలో వైద్య విద్యను పూర్తి చేసిన సాయి పల్లవికి టర్నింగ్ పాయింట్ మూవీగా ఫిదా అని చెప్పవచ్చు. ఫిదా మూవీలో భానుమతి సింగిల్ పీస్ అంటూ తెలంగాణ స్లాంగ్ లో సాయి పల్లవి చెప్పిన డైలాగులకు నిజంగానే రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. శేఖర్ కమ్ముల తన ఫిదా సినిమాలో హీరో వరుణ్ తేజ్ కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ సాయి పల్లవికే ఇచ్చారు.అయితే మొదటినుంచి సెలక్టివ్ పాత్రలనే ఎంచుకుంటూ కెరీర్ ని సాగిస్తోంది సాయి పల్లవి. సినీ రంగంలోకి రాకముందు సాయి పల్లవి చాలా భయపడిందని ఓ సందర్భంలో చెప్పారు. ముఖ్యంగా తన వాయిస్, అలాగే మొటిమలు మైనస్ అనుకుందట. కానీ ఆమె సహజ నటన ప్రేక్షకులకు నచ్చింది. అచ్చంగా తమ ఇంటి ఆడపిల్లగా సాయి పల్లవిని ఆదరించారు.
సోదరి పూజా కన్నన్ వివాహం
సాయి పల్లవి ఇంట పెళ్లి భాజాలు మోగాయి. ఆమె సోదరి పూజా కన్నన్ వివాహం ఎంతో వైభవంగా జరిగింది. సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ కూడా నటే అన్న సంగతి చాలా మందికి తెలియదు. 2021 లో ఓ తమిళ చిత్రంలో నటించింది పూజా కన్నన్. చితిరై సెవ్వానం మూవీతో ఎంట్రీ ఇచ్చారామె .కేవలం ఒక్క సినిమాలోనే నటించిన పూజా కన్నన్ ఆ తర్వాత పెద్దగా సినిమాలపై ఇంట్రెస్ట్ చూపలేదు. అయితే పూజా కొంతకాలంగా వినీత్ అనే యువకుడిని ప్రేమించారు. వారిద్దరి వివాహం పెద్దల అంగీకారంతో జరిగింది. ఈ సంవత్సరం జనవరి నెలలో వీరిద్దరి నిశ్చితార్థం ఎంతో వైభవంగా జరిగింది. అయితే ఈ వివాహ వేడుకలో సాయి పల్లవి సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. తన సోదరితో కలిసి దిగిన ఫొటోలు..సాయి పల్లవి డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ గా మారాయి. ఇక ఇన్ స్టా వేదికగా సాయి పల్లవి ఈ జంటను అభినందిస్తూ పోస్టింగ్ కూడా పెట్టారు.
మేకప్ కు ఆమడ దూరం
సాయి పల్లవి ఎక్కువగా ఆర్భాటంగా మేకప్ వేసుకోరు. తన లిమిట్స్ లో తానుంటారు. సినిమాలలోనూ సహజంగా ఉండేందుకు ఇష్టపడతారు. హెవీ మేకప్ ఏమీ చేసుకోరు. నటనలోనూ అలాగే సహజత్వం ఉండాలని కోరుకుంటారు. ఫెయిర్ ఇన్ లవ్ లీ యాడ్ చేయవలసిందిగా ఆఫర్ వచ్చినా సాయి పల్లవి వదిలేసుకుంది. అందుకే తన తొలి చిత్రం నుంచి మేకప్ లేకుండానే నటిస్తుంది. సహజ నటన,సహజమైన అందం, వ్యక్తిత్వం ఎప్పుడూ కోరుకునేది అదేనంటారు సాయి పల్లవి.
Queen in her sister's wedding 🤍✨❤️@Sai_Pallavi92#SaiPallavi #SaiPallaviSisterWedding pic.twitter.com/uPJ6OT8tKw
— Sai pallavi (@SaiPallavi92s) September 5, 2024
OMG…Sai Pallavi n her Sister Danced for Marati Song Apasara Aali 😭💃❤️🔥@Sai_Pallavi92#Saipallavi #PoojaKannan#SaiPallaviSisterWedding pic.twitter.com/xCYxct9oIX
— Sai Pallavi FC™ (@SaipallaviFC) September 4, 2024