BigTV English

Sai Pallavi: ఇదిగో హీరోయిన్స్.. సాయి పల్లవిని చూసి నేర్చుకోండమ్మా.!

Sai Pallavi: ఇదిగో హీరోయిన్స్.. సాయి పల్లవిని చూసి నేర్చుకోండమ్మా.!

Sai Pallavi: మామూలుగా హీరోయిన్స్‌కు బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకోగానే వారి యాటిట్యూడ్ మారిపోతుందని, వారి కోరికలు పెరిగిపోతాయని చాలామంది నిర్మాతలు ఓపెన్‌గానే కామెంట్స్ చేశారు. అలాంటిది వారందరి కంటే సాయి పల్లవి చాలా భిన్నం. ఎన్ని హిట్లు వచ్చినా, ఎంతమంది తనను ఎంత పొగిడినా.. తను మాత్రం ఒదిగే ఉంటుంది. ఈ మాట ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మేకర్స్ కూడా చెప్తుంటారు. ఇండస్ట్రీలోనే చాలామంది సాయి పల్లవికి ఫ్యాన్స్ ఉన్నారు. తన అందం, అభినయం, నాట్యం మాత్రమే కాదు.. తన ఆఫ్ స్క్రీన్ క్యారెక్టర్ కూడా అందరూ తనను అభిమానించేలా చేస్తుంది. తాజాగా తనకు ఒంట్లో బాలేకపోయినా ‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చి మరోసారి అందరి మనసు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.


ఎందుకలా చేసింది.?

ఫిబ్రవరి 7న ‘తండేల్’ మూవీ విడుదలకు సిద్ధమవుతుండగా.. మేకర్స్ అంతా ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. కేవలం తెలుగులోనే కాదు.. ఈ మూవీ తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది అందుకే ప్రతీ భాషా ప్రేక్షకుడికి ఈ సినిమా రీచ్ అవ్వాలని అక్కడి హీరోలను కూడా రంగంలోకి దింపారు. తమిళంలో ‘తండేల్’ ట్రైలర్‌ను కార్తీతో లాంచ్ చేయించారు, హిందీలో ఈ మూవీ ట్రైలర్‌ను అమీర్ ఖాన్ లాంచ్ చేశాడు. ఈ రెండు ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్‌కు సాయి పల్లవి డుమ్మా కొట్టింది. మామూలుగా తను నటించిన సినిమాల ఈవెంట్స్‌కు సాయి పల్లవి కచ్చితంగా అటెండ్ అవుతుంది. అలాంటిది ఈ ఈవెంట్స్‌కు ఎందుకు మిస్ అయ్యింది అని ఫ్యాన్స్‌లో సందేహాలు మొదలవ్వగా తనకు ఇంట్లో అస్సలు బాలేదనే విషయం బయటపడింది.


ఒంట్లో బాలేకపోయినా

సాయి పల్లవి (Sai Pallavi) ప్రస్తుతం జ్వరంతో బాధపడుతోంది. అందుకే డాక్టర్లు తనను పూర్తిగా రెండు రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. అయినా కూడా ‘తండేల్’ (Thandel) ప్రీ రిలీజ్ ఈవెంట్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతో తన ఒంట్లో బాలేకపోయినా వచ్చి అందరినీ అలరించింది. అంతే కాకుండా తన గొంతు సరిగా లేకపోయినా కూడా ‘తండేల్’ కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరి గురించి ప్రత్యేకంగా మాట్లాడింది, వారికి థాంక్యూ చెప్పుకుంది. దీంతో సాయి పల్లవి పడుతున్న కష్టాన్ని చూసి మిగతా హీరోయిన్లు నేర్చుకోవాలి అంటూ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఆఖరికి ఈ మూవీ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన సందీప్ రెడ్డి వంగా కూడా సాయి పల్లవిపై ప్రశంసలు కురిపించాడు.

Also Read: పాపం నాగచైతన్య.. ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు..

సందీప్ ప్రశంసలు

‘అర్జున్ రెడ్డి’ సినిమా తెరకెక్కిస్తున్న సమయంలో సాయి పల్లవిని హీరోయిన్‌గా పరిగణనలోకి తీసుకుంటే తన మ్యానేజర్ మాత్రం అలాంటి ఆలోచన కూడా పెట్టుకోవద్దని క్లారిటీ ఇచ్చాడని గుర్తుచేసుకున్నాడు. మామూలుగా ఏ హీరోయిన్ అయినా మొదట్లో అలాగే అన్నింటికి నో అంటుందని కానీ సమయం గడుస్తున్నాకొద్దీ వాళ్లే అన్నింటిని ఒప్పుకుంటారని అన్నాడు. కానీ సాయి పల్లవి మాత్రం పదేళ్ల పాటు దేనికి లొంగకుండా అలాగే ఉండడం గ్రేట్ అన్నాడు. అలా సాయి పల్లవి చేస్తున్న పనులకు, తన ప్రవర్తనకు రోజురోజుకీ తనపై ప్రేక్షకుల్లో అభిమానం పెరుగుతూ వస్తోంది. ‘తండేల్’ను కేవలం సాయి పల్లవి కోసమే చూడాలని కూడా చాలామంది ఫిక్స్ అయ్యారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×