BigTV English
Advertisement

Coolie: ‘కూలీ’లో శివకార్తికేయన్ గెస్ట్ రోల్.? క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో

Coolie: ‘కూలీ’లో శివకార్తికేయన్ గెస్ట్ రోల్.? క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో

Sivakarthikeyan In Coolie: ఈరోజుల్లో ఒక స్టార్ హీరో సినిమాలో యంగ్ హీరోలు లీడ్ రోల్ చేయడం లేదా ఒక భాషలోని స్టార్ హీరో మరో భాషా చిత్రంలో గెస్ట్ రోల్ ప్లే చేయడం లాంటివి కామన్ అయిపోయాయి. అలా అయితేనే మూవీపై హైప్ క్రియేట్ అవుతుందని మేకర్స్ కూడా ఫీలవుతున్నారు. కానీ గెస్ట్ రోల్స్ కంటే ముఖ్యమైన పాత్రల్లో స్టార్ హీరోలు నటించేలా చేయడం అనేది సక్సెస్ ఫార్ములాగా మారిపోయింది. ఇలాంటి ఒక ఫార్ములాను యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ పరిచయం చేశాడు. ‘విక్రమ్’లో ఇదే పద్ధతిని ఫాలో అయిన ఈ డైరెక్టర్.. ఇప్పుడు ‘కూలీ’లో కూడా అదే ఫాలో అవుతున్నాడు. తాజాగా ఈ సినిమా విషయంలో ప్రేక్షకులకు ఒక క్లారిటీ వచ్చింది.


నిజమా? కాదా?

లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమానే ‘కూలీ’ (Coolie). ఈ మూవీలో ఇప్పటికే నాగార్జున ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం నాగార్జున సీన్‌కు సంబంధించిన ఫుటేజ్ కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యి రచ్చ చేసింది. నాగార్జునతో పాటు ఈ సినిమాలో సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర లాంటి నటులు కూడా ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే కొన్నాళ్ల నుండి ‘కూలీ’లో శివకార్తికేయన్ కూడా గెస్ట్ రోల్ చేయనున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వడానికి శివకార్తికేయన్ స్వయంగా ముందుకొచ్చాడు. ‘అమరన్’ మూవీ ప్రమోషన్స్ సమయంలో ఈ విషయాన్ని బయటపెట్టాడు.


Also Read: దేవర క్లైమాక్స్ ట్విస్ట్ రివీల్… దేవర చావు వెనక ఉన్న అసలు నిజమిదే..

సినిమా సెట్‌లో కనిపించాడు

‘కూలీ’లో తాను ఎలాంటి పాత్ర చేయడం లేదని తేల్చిచెప్పేశాడు శివకార్తికేయన్. లోకేశ్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తున్నఈ మూవీ సెట్‌లో శివకార్తికేయన్ (Sivakarthikeyan) పలుమార్లు కనిపించాడు. దానివల్లే మూవీలో తాను కూడా ఉన్నాడనే రూమర్స్ బయటికొచ్చాయి. కానీ అవన్నీ కేవలం రూమర్సే అని క్లారిటీ ఇచ్చేశాడు ఈ యంగ్ హీరో. తాను చాలాసార్లు ‘కూలీ’ సెట్‌కు వెళ్లిన మాట నిజమే అని, ‘అమరన్’ ప్రమోషన్స్ తర్వాత కూడా మళ్లీ వెళ్తానని చెప్పుకొచ్చాడు. మామూలుగా హీరోలు.. ఇతర హీరోల సినిమాల సెట్‌లో కనిపించడం కామనే. కానీ శివకార్తికేయన్ మాత్రం ‘కూలీ’ సెట్‌లో ఎక్కువసార్లు కనిపించేసరికి ఈ రూమర్స్ బయటికొచ్చాయి.

గెస్ట్ రోల్స్ ఓకే

ఇక శివకార్తికేయన్ సినిమాల విషయానికొస్తే.. తాజాగా ‘అమరన్’ మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు ఈ హీరో. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. తమిళంతో పాటు ఈ మూవీలో తెలుగులో కూడా విడుదలవ్వగా.. రెండు భాషల్లో సూపర్ హిట్‌ను సాధించింది. ఇప్పుడు అదే జోష్‌తో మరికొన్ని సినిమాలను ఓకే చేశాడు శివకార్తికేయన్. తాను హీరోగా ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉంటూనే ఇతర స్టార్ హీరోల సినిమాల్లో కూడా క్యామియో చేయడానికి ఏ మాత్రం వెనకాడడు. అదే విధంగా విజయ్ హీరోగా తెరకెక్కిన ‘ది గోట్’లో కూడా చిన్న పాత్రలో కనిపించి అలరించాడు శివకార్తికేయన్.

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×