Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. టాలీవుడ్ లోనే కాదు అన్ని ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. మూడేళ్ళ క్రితం చూపే బంగారమయ్యనే శ్రీవల్లి అంటూ దేశం మొత్తాన్ని తన పాటతో ఒక ఊపు ఊపేసింది. ఇక గతేడాది చూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ అంటూ ఇంకోసారి తన సత్తా చాటింది. పుష్ప 2 సినిమాతో రష్మిక భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అమ్మడికి మరింత బూస్ట్ ఇచ్చింది.
పుష్ప 2 కన్నా ముందే రష్మిక చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. తెలుగు, తమిళ్, హిందీ అని తేడా లేకుండా స్టార్ హీరోల సినిమాలో ఛాన్స్ లు పట్టేసింది. తెలుగు సినిమాల విషయం పక్కన పెడితే.. ఎప్పటినుంచో రష్మిక హిందీలో పాగా వేయడానికి కష్టపడుతుంది. తన మొదటి బాలీవుడ్ ఎంట్రీనే బిగ్ బి అమితాబ్ బచ్చన్ సినిమాతో ఇచ్చింది. గుడ్ బాయ్ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నదానికి ఆశించిన ఫలితం మాత్రం ఆ సినిమా ఇవ్వలేకపోయిన మంచి ఛాన్స్ లు వచ్చేలా అయితే చేసిందనే చెప్పాలి. ఈ సినిమా తరువాత సిద్దార్థ్ మల్హోత్రా సరసన రష్మిక రొమాన్స్ చేసింది. అయితే ఈ చిత్రం ఒక మోస్తరుగా ఆడింది.
Akshay Kumar: పక్షిరాజే ఫోన్ వాడమని చెప్తున్నాడు.. ఇదసలు ఊహించలేదే
ఇక ఈ రెండు చిత్రాల తరువాత అనిమల్ సినిమాతో రష్మిక హిందీలో తిరుగులేని హీరోయిన్ గా నిలిచింది. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గీతాంజలి పాత్రలో రష్మిక నటన నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ గా నిలిచింది. ఆ ఒక్క సినిమా అమ్మడి లైఫ్ ను తిరగరాసింది. ఇక అనిమల్ తరువాత రష్మిక మరో పెద్ద సినిమాలో ఛాన్స్ పట్టేసింది. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న చావాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దినేష్ విజన్ నిర్మిస్తున్నాడు.
ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అన్ని బావుంటే చావా.. పుష్ప 2 తో పోటీకి దిగి ఉండాలి. అయితే కొన్ని కారణాల వలన అప్పుడు వాయిదా పడిన చావా.. ఫిబ్రవరి 14 న రిలీజ్ కు రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేశారు.
ట్రైలర్ డేట్ ను అనౌన్స్ చేస్తూ.. రష్మిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రష్మిక.. యేసుబాయి మహారాణి పాత్రలో కనిపించనుందని తెలిపారు. శంభాజీ మహారాజ్ జీవితంలో అతని భార్య యేసుబాయి మహారాణి పాత్ర కీలకమని పోస్టర్ ను బట్టే అర్ధమవుతుంది. మహారాణి పాత్రలో రష్మిక అద్భుతంగా కనిపించింది. ఆ కాలం నాటి దుస్తులు, ఆభరణాలు, అలంకారంతో రష్మిక అప్పటి మహారాణిని గుర్తుచేస్తుంది. గతేడాది పుష్ప 2 విజయంతో ఏడాదిని ముగించిన నేషనల్ క్రష్.. చావాతో ఈ ఏడాది మొదలుపెట్టనుంది. మరి ఈ సినిమాతో రష్మిక హిట్ కొట్టి రష్మిక నామ సంవత్సరం మొదలుపెడుతుందో లేదో చూడాలి.
Behind every great king, there stands a queen of unmatched strength.
Maharani Yesubai – the pride of Swarajya. #ChhaavaTrailer Out Tomorrow!Releasing in cinemas on 14th February 2025.#Chhaava #ChhaavaOnFeb14@vickykaushal09 #AkshayeKhanna #DineshVijan @Laxman10072… pic.twitter.com/lclHEr2lAk
— Rashmika Mandanna (@iamRashmika) January 21, 2025