West Bengal District Crime: సమాజంలో మనుషులు మృగాల్లా మారిపోతున్నారు. వాయి వరుసలు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు పసి పిల్లలపై అత్యాచారాలకు పాల్పడ్డ కిరాతకులను చూశాం. చిన్న బాలికలపై వృద్ధుల వెధవ వేషాలకు సంబంధించి ఎన్నో వార్తలు వింటూనే ఉన్నాం. కానీ, ఇప్పటి వరకు వినని, చూడని ఓ దారుణ ఘటన బయటకు వచ్చింది. మైనర్ మేనల్లుడిపై గత కొంత కాలంగా అత్యాచారానికి పాల్పడటంతో పాటు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో సంచలనం కలిగించింది.
వీడియోలను అడ్డం పెట్టుకుని బెదిరింపులు
పరగణా జిల్లాకు చెందిన ఓ మహిళ మైనర్ మేనల్లుడిపై రోజుల తరబడి అత్యాచారానికి పాల్పడిన ఘటన అందరినీ షాక్ కి గురి చేసింది. మారుమూల గ్రామానికి చెందిన ఈ మహిళ చాలా కాలంగా ఒంటరిగా జీవిస్తుంది. గత కొద్ది కాలంగా మైనర్ అయిన సోదరుడి కుమారుడిపై లైంగిక దాడికి పాల్పడుతున్నది. రోజూ పిలిపించుకుని లైంగిక వాంఛలను తీర్చుకుంటున్నది. అత్యాచారం చేయడంతో పాటు వీడియోలను తీసిసేది. ఒకవేళ ఈ విషయాన్ని బయటకు చెప్తే వీడియోలను అందరికీ చూపిస్తానని బెదిరించింది. ఏం చేయాలో తోచని బాలుడు ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. రోజు రోజుకు ఆమె వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేకపోయాడు.
తల్లికి అసలు విషయం చెప్పిన బాలుడు
మేన అత్త లైంగిక వేధింపులను తట్టుకోలేకపోయిన ఆ బాలుడు.. చివరకు అసలు విషయాన్ని తన తల్లికి చెప్పాడు. అత్త గత కొంతకాలంగా తన మీద చేస్తున్న లైంగిక దాడితో పాటు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ ఎలా చేస్తుందో వివరించాడు. వెంటనే బాలుడి తల్లి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాలుడిని ఇబ్బంది పెట్టిన సదరు మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. రంగంలోకి దిగిన పోలీసులు మైనర్ బాలుడిపై అత్యాచారానికి పాల్పడిన అత్తను అరెస్టు చేశారు. పోలీస్ రిమాండ్ కు తరలించారు. ఈ ఘటపై ప్రత్యేక బృందంతో విచారణ జరుపుతున్నారు. నిందితురాలికి తగిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు వెల్లడించారు.
మైనర్ మేనల్లుడిని అత్యాచారం చేసిన అత్త
పశ్చిమ బెంగాల్లోని పరగణా జిల్లాలో షాకింగ్ ఘటన
అత్యాచారం చేయడమే గాక వీడియోలు తీసి బ్లాక్ మెయిల్
జరిగిన విషయాన్ని బాలుడు తల్లికి చెప్పుకోవడంతో వెలుగులోకి వచ్చిన ఘటన
అత్యాచారం చేసిన మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/6TDlBnHprG
— BIG TV Breaking News (@bigtvtelugu) January 22, 2025
Read Also: తాను సాధ్వీ అని చెప్పుకుంటోంది గానీ.. అసలు సంగతి తెలిస్తే ఆశ్చర్యపోతారు!
అటు ఈ ఘటనపై పలువురు సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలికల మీద అత్యాచారాలకు పాల్పడే వారి విషయంలో పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారో, బాలుడి మీద జరిగిన అత్యాచారాన్ని కూడా అలాగే పరిగణించాలంటున్నారు. సదరు మహిళను న్యాయస్థానం కఠినంగా శిక్షించేలా ఆధారాలు సమర్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో సంచలనంగా మారింది. రీసెంట్ గా RG కర్ జూనియర్ వైద్యురాలి హత్యాచార నిందితుడికి జీవిత ఖైదు విధించిన నేపథ్యంలో ఈ కేసుకు ప్రాధాన్యత ఏర్పడింది.
Read Also: ఇదెక్కడి దొంగతనం రా బాబూ.. రైల్వే స్టేషన్ లో యువకుడికి ఊహించని షాక్!