BigTV English

Salaar: ఇంగ్లీష్ వెర్ష‌న్‌లో‘స‌లార్‌’… అవేవీ ఉండ‌వ‌ట‌!

Salaar: ఇంగ్లీష్ వెర్ష‌న్‌లో‘స‌లార్‌’… అవేవీ ఉండ‌వ‌ట‌!

Salaar:పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ నాలుగు భారీ ప్రాజెక్ట్స్‌ను ప్రేక్ష‌కుల కోసం సిద్ధం చేస్తున్నారు. అందులో ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌కుడిగా రూపొందుతోన్న ‘సలార్’ మూవీ ఒకటి. ఇప్ప‌టి వ‌ర‌కు స‌లార్ మూవీ నుంచి రెండు, మూడు పోస్ట‌ర్స్ మిన‌హా మ‌రేమీ అప్‌డేట్ లేదు. దీంతో ఫ్యాన్స్‌లో అంచనాలు నెక్ట్స్ రేంజ్‌కి చేరుకుంటున్నాయి. ఈ అంచ‌నాల‌ను పెంచుతూ మ‌రో విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే స‌లార్ సినిమాను పాన్ ఇండియా మూవీగా కాకుండా పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా రిలీజ్ చేయ‌టానికి మేక‌ర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా స‌లార్ సినిమాను ఇంగ్లీష్ వెర్ష‌న్‌ను సిద్ధం చేస్తున్నారు.


మ‌రి మ‌న ఇండియాలో రిలీజ్ కాబోతున్న వెర్ష‌న్‌కి, ఇంగ్లీష్ వెర్ష‌న్‌కు ఎలాంటి తేడాలుంటాయ‌నే దానిపై కూడా ప‌లు రకాలు వార్త‌లు వినిపిస్తున్నాయి. అదేంటంటే.. మ‌న ఇండియాలో రిలీజ్ కాబోతున్న వెర్ష‌న్‌లో ఉండే పాట‌లు, కామెడీ సీన్స్ లేకుండా ఇంగ్లీష్ వెర్ష‌న్‌ను రిలీజ్ చేస్తున్నార‌ట‌. ఆ లెక్క‌లో చూస్తే మ‌న వెర్ష‌న్ కంటే ఇంగ్లీష్ వెర్ష‌న్ అర‌గంట వ్య‌వ‌ధి త‌క్కువ‌గా ఉంటుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

ఇప్ప‌టి వ‌ర‌కు స‌లార్ మూవీ నుంచి రెండు, మూడు పోస్ట‌ర్స్ మిన‌హా మ‌రేమీ అప్‌డేట్ లేదు. దీంతో ఫ్యాన్స్‌లో ఎక్స్‌పెక్టేష‌న్స్ పీక్స్‌కి చేరుకుంటున్నాయి. ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయ‌న‌టానికి రీసెంట్‌గా ఓ ప్రూఫ్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. స‌లార్ మూవీ బుక్ మై షోలో రికార్డ్ క్రియేట్ అయ్యింది. ఈ యాప్‌లో ఒక ల‌క్ష ఇంట్రెస్ట్స్ వ‌చ్చాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో చిత్రానికి ఇన్ని ఇంట్రెస్ట్స్ రాలేదు. అదే మా ప్ర‌భాస్‌కున్న క్రేజ్ అని ఫ్యాన్స్ సంబ‌ర‌ప‌డిపోతున్నారు.


స‌లార్ సినిమాను ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండ‌టంతో ఎక్స్‌పెక్టేష‌న్స్ చాలా ఎక్కువ‌గా ఉన్నాయి. కె.జి.య‌ఫ్ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన ప్ర‌శాంత్ నీల్ హీరోయిజాన్ని ఎలా ఎలివేట్ చేస్తార‌నే సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 28న తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ కానుంది. హోంబ‌లే ఫిలింస్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శ్రుతీ హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

Nani: నేను అందుక‌నే స్టార్ డైరెక్ట‌ర్స్‌తో సినిమాలుచేయ‌టం లేదు: నాని

KCR: ఎకరాకు 10వేలు పరిహారం.. కేంద్రానికి చెప్పినా గోడకు చెప్పినా ఒకటే: కేసీఆర్

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×