BigTV English

Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోలింగ్.. దెబ్బకు ట్విట్టర్ అకౌంట్ మూసేసిన డైరెక్టర్

Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోలింగ్.. దెబ్బకు ట్విట్టర్ అకౌంట్ మూసేసిన డైరెక్టర్

Salaar: కేరాఫ్ కంచరపాలెం సినిమాతో టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయమైన వెంకటేష్ మహా.. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నాడు. డైరెక్షన్ తో పాటు యాక్టింగ్ కూడా షురూ చేసిన ఇతను.. కొద్దినెలల క్రితం కేజీఎఫ్ సినిమాపై విమర్శలు చేసి.. నెటిజన్ల ట్రోలింగ్ కు గురయ్యాడు. ఒక్క సినిమా తీసి మిగతా సినిమాలను తిట్టే రేంజ్ కు వచ్చావా అంటూ.. నెటిజన్లు ఎప్పుడుపడితే అప్పుడు వెంకటేష్ మహా పై విమర్శలు చేస్తూనే ఉన్నారు.


తాజాగా మళ్లీ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేసిన సలార్ పై ఇన్ డైరెక్ట్ గా చేసిన ఒక ట్వీట్.. మళ్లీ వివాదంలోకి నెట్టింది. ఈ ట్వీట్ పై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేసి, రిపోర్ట్ కొట్టడంతో.. దెబ్బకి ట్విట్టర్ అకౌంట్ ను డీ యాక్టివేట్ చేసేశాడు.

ఇండియా మొత్తం సలార్ ఫీవర్ వచ్చేసింది. 22న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్న సలార్ కోసం.. ప్రభాస్ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో వెంకటేష్ మహా షారుఖ్ ఖాన్ సినిమాపై ట్వీట్ వేశాడు. “నా ఫేవరేట్ హీరో షారుఖ్ ఖాన్ ను రాజ్ కుమార్ హిరాణి గారి డంకీ సినిమాలో చూసేందుకు నేను రెడీ. ఫస్ట్ డే నే టికెట్ బుక్ చేసుకున్నాను. సెన్సార్ బోర్డు వాళ్లు సినిమా చూసి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారని విన్నాను. అదే నిజమైతే ఈ సినిమా ఎమోషన్స్ తో ఫిలిం లవర్స్ ను మెప్పిస్తుంది” అని ట్వీట్ చేశాడు.


ఇందులో తప్పేముంది అనుకుంటున్నారా ? అసలు సంగతి ఇక్కడే ఉంది. ఈ ట్వీట్ సరిగ్గా సలార్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక పెట్టడంతో.. డార్లింగ్ ఫ్యాన్స్ వెంకటేష్ మహాపై ఫైరయ్యారు. సలార్ ను ఇన్ డైరెక్ట్ గా హేట్ చేస్తున్నాడని కామెంట్ చేశారు. కావాలనే అభిమానులను ట్రిగ్గర్ చేస్తున్నాడని విమర్శించారు. ట్రోల్ చేస్తూ.. అకౌంట్ రిపోర్ట్ కొట్టడంతో.. నెటిజన్ల దెబ్బకు అకౌంట్ ను డీ యాక్టివేట్ చేసుకుని వెళ్లిపోయాడు. మాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు మరి అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×