BigTV English
Advertisement

Salman – Atlee Film : అట్లీకి బిగ్ షాక్… సల్మాన్ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టిన నిర్మాతలు

Salman – Atlee Film : అట్లీకి బిగ్ షాక్… సల్మాన్ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టిన నిర్మాతలు

Salman – Atlee Film : చాలాకాలంగా సల్మాన్ ఖాన్ (Salman Khan) – అట్లీ (Atlee) కాంబినేషన్లో సినిమా రాబోతుందని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటిదాకా పెద్దగా వివరాలు తెలియక పోయినప్పటికీ, సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajiniknth) ఈ మూవీలో భాగం కావచ్చు అనే రూమర్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అట్లీకి నిర్మాతలు బిగ్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏకంగా ఈ సినిమాను వాయిదా వేసారని టాక్ నడుస్తోంది.


అట్లీ – సల్మాన్ ఖాన్ మూవీ వాయిదా

సల్మాన్ ఖాన్ – అట్లీ కాంబినేషన్లో రాబోతున్న నెక్స్ట్ మూవీ నటీనటుల సమస్య కారణంగా వాయిదా పడినట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్ లేదా కమల్ హాసన్ లను ఓ కీలక పాత్ర కోసం సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నారట. కానీ అది వర్కౌట్ కాకపోవడంతో నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ డైరెక్టర్ అట్లీని ఈ ప్రాజెక్టుపై రీవర్క్ చేయమని కోరినట్టు సమాచారం.


అట్లీ ఈ సినిమాలో కమల్ హాసన్ లేదా రజినీకాంత్ లాంటి స్టార్ హీరోలను ఓ స్పెషల్ రోల్ కోసం సెలెక్ట్ చేయాలని చూస్తున్నాడు. ఒకవేళ వారిద్దరూ కుదరకపోతే ఇందులో విల్ స్మిత్ ను నటింపజేయాలనేది ఆయన ఆలోచన అని తెలుస్తోంది. అందుకే సల్మాన్ ఖాన్ విల్ స్మిత్ ను కలవడానికి హెల్ప్ చేశాడట. మొత్తానికి సంప్రదింపులు, ఈ సినిమాలో నటించడానికి విల్స్ స్మిత్ స్పందించిన తీరు పాజిటివ్ గానే ఉన్నట్టు టాక్ నడుస్తోంది. కానీ నిర్మాణ సంస్థ మాత్రం ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో పాటు మరో సౌత్ సూపర్ స్టార్ కూడా ఉండేలా చూడమని డిమాండ్ చేయడంతో అట్లీకి షాక్ తగిలింది.

ప్రాజెక్ట్ ను హోల్డ్ లో… కారణం ఇదే ?

సమాచారం ప్రకారం సన్ పిక్చర్స్ సౌత్ స్టార్ లేని ఇంటర్నేషనల్ సినిమా తీయడానికి ఇష్టపడట్లేదని తెలుస్తోంది. అందుకే అట్లిని ఈ ప్రాజెక్టు పై రీవర్క్ చేయమని రిక్వెస్ట్ చేశారని అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టు ఇంకా ఆగిపోలేదు. సల్మాన్ ఖాన్ ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమస్యకు సంబంధించి అట్లీ, సల్మాన్… సన్ పిక్చర్స్ తో కలిసి చర్చిస్తున్నారు. మార్చ్ చివరి నాటికి సల్మాన్ ఖాన్ తో అట్లీ ప్రాజెక్ట్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇక ఈ ప్రాజెక్ట్ కి ఇప్పటికే A6 అనే వర్కింగ్ టైటిల్ ని ఖరారు చేశారు. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టును హోల్డ్ లో పెట్టినట్టు సమాచారం. కానీ ఈ రూమర్లపై నిర్మాతలు ఇప్పటిదాకా స్పందించలేదు. మరోవైపు అట్లీ అల్లు అర్జున్ తో ఓ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ముందుగా అట్లీ – బన్నీ కాంబినేషన్లో మూవీ సెట్స్ పైకి వెళ్తుందా? లేదంటే సల్మాన్ ఖాన్ తోనే మూవీని పట్టాలెక్కిస్తాడా? అనేది చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×