Atlee : ‘జవాన్’ వంటి సూపర్ సక్సెస్ తర్వాత అందరి చూపు అట్లీ (Atlee) పైన పడింది. కానీ అట్లీ మాత్రం ఏరి కోరి సినిమాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతుండడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలతో ఆయన సినిమాలు చేయబోతున్నారని వార్తలు వినిపించగా, ఫైనల్ గా సల్మాన్ ఖాన్ (Salman Khan) తో మూవీ ఫిక్స్ అని టాక్ నడిచింది. కానీ తాజాగా ఈ మూవీ కూడా ఆగిపోయింది అనే పుకార్లు వినిపిస్తున్నాయి బాలీవుడ్ లో.
అట్లీ సల్మాన్ ప్రాజెక్ట్ ఆగిపోయిందా?
సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా నటిస్తున్న ‘సికిందర్’ (Sikandar) మూవీ సమ్మర్ లో రిలీజ్ కానుంది. వెంటనే సల్మాన్ ఖాన్, అట్లీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది అనే ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్టుగా అనిపిస్తుంది. సల్మాన్ ఖాన్ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి, అట్లీ మరో స్టార్ హీరోతో మూవీని చేయడానికి సిద్ధమవుతున్నట్టు టాక్ నడుస్తోంది. యూటర్న్ తీసుకుని, వద్దన్న స్టార్ తోనే అట్లీ మళ్లీ సినిమాకు సిద్ధం అయ్యాడని అంటున్నారు.
గతంలో ఆయన అల్లు అర్జున్ (Allu Arjun) తో సినిమా చేయబోతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని అన్నారు. కానీ ఎట్టకేలకు అట్లీ – అల్లు అర్జున్ తోనే సినిమా చేయబోతున్నాడని అంటున్నారు.
అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ సెట్
అట్లీ ఇప్పటికే అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించాడని సమాచారం. వచ్చే నెలలో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడే అవకాశం ఉంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఈ మూవీ కోసం అల్లు అర్జున్ తో పాటు అట్లీ కూడా భారీ రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారు.
గతంలో కూడా అల్లు అర్జున్ తో కలిసి పని చేయాలనుకున్నారు అట్లీ. కానీ ఈ మూవీ మల్టీస్టారర్ కావడంతో అల్లు అర్జున్ రిజెక్ట్ చేశాడని, అదే స్టోరీని పట్టుకుని వెళ్ళగా సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పుకార్లు షికారులు చేశాయి. ఇక ఈ భారీ ప్రాజెక్టులో మరో కీలక పాత్ర కోసం కమల్ హాసన్ తో అట్లీ చర్చలు జరుపుతున్నట్టు కోలీవుడ్ మీడియా కోడై కూసింది. అయితే ఇప్పుడు ఏమైందో తెలియదు గానీ, అటు తిరిగి ఇటు తిరిగి అట్లీ అల్లు అర్జున్ తోనే సినిమా చేయబోతుండడం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు అల్లు అర్జున్, త్రివిక్రమ్ (Trivikram Srinivas) తో మరో మూవీని కూడా మొదలు పెట్టబోతున్నారు. ఈ ఏడాది అల్లు అర్జున్ ఒకేసారి రెండు సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే ఈ ఏడాది గ్యాప్ తీసుకుని, వచ్చే ఏడాది బన్నీ అభిమానులకు డబుల్ సర్ప్రైజ్ ఇచ్చే ఛాన్స్ ఉంది.