BigTV English

Salman Khan: సల్మాన్ ఖాన్ హాలీవుడ్ డెబ్యూ.. మరీ అలాంటి పాత్రలో అంటే ఫ్యాన్స్ ఫీలవుతారేమో.!

Salman Khan: సల్మాన్ ఖాన్ హాలీవుడ్ డెబ్యూ.. మరీ అలాంటి పాత్రలో అంటే ఫ్యాన్స్ ఫీలవుతారేమో.!

Salman Khan: గత కొన్నేళ్లలో బాలీవుడ్ నుండి ఎంతోమంది నటీనటులు హాలీవుడ్‌కు వెళ్లి తమ సత్తాను చాటుకున్నారు. ఇక ఈమధ్యకాలంలో ఇండియన్ ఇండస్ట్రీ బాగా పాపులర్ అయ్యింది. హాలీవుడ్‌కు ధీటుగా పోటీపడే స్థాయికి ఎదిగింది. అందుకే హాలీవుడ్ మేకర్స్ సైతం ఇండియన్ దర్శక నిర్మాతలతో, నటీనటులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలిగిపోతున్నారు సల్మాన్ ఖాన్. అలాంటి హీరో మాత్రం ఇప్పటివరకు అసలు హాలీవుడ్ తెరపై కనిపించపోవడం ఏంటి అని తన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతుంటారు. ఇంతలోనే సల్మాన్ ఖాన్ హాలీవుడ్ డెబ్యూకు సమయం వచ్చేసింది. కానీ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యే రేంజ్‌లో తన పాత్ర ఉండదని సమాచారం.


ఫుటేజ్ లీక్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హిందీ సినిమాలతోనే ఫుల్ బిజీగా ఉన్నారు. తను హీరోగా నటించిన ఒక సినిమా థియేటర్లలో విడుదల అవ్వగానే వెంటనే మరొక మూవీని ఓకే చేసి దాని షూటింగ్‌లో బిజీ అయిపోతారు సల్మాన్. అలా సల్మాన్ కెరీర్‌లో ఎప్పుడూ పెద్దగా గ్యాప్ ఉండదు. ప్రస్తుతం తను మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న ‘సికిందర్’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఇంతలోనే సల్మాన్ ఖాన్ హాలీవుడ్ డెబ్యూకు సిద్ధమయ్యాడంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడం మొదలయ్యింది. చాలామంది ఫ్యాన్స్ ఇది నిజమని నమ్మలేదు. కానీ హాలీవుడ్ మూవీ సెట్ నుండి సల్మాన్ షూటింగ్ ఫుటేజ్ లీక్ అయిన తర్వాత నమ్మక తప్పలేదు.


Also Read: అట్లీకి బిగ్ షాక్.. సల్మాన్ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌ను పెట్టిన నిర్మాతలు..

హాలీవుడ్ రీమేక్‌లో

2021లో అర్జెంటీనియన్ భాషలో విడుదలయ్యి సూపర్ హిట్ సాధించిన సినిమానే ‘సెవెన్ డాగ్స్’. ప్రస్తుతం హాలీవుడ్ మేకర్స్.. ఈ సినిమాను ఇంగ్లీష్‌లో రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ రీమేక్‌కు సంబంధించిన షూటింగ్ చాలాకాలం క్రితమే ప్రారంభమయ్యింది. ప్రస్తుతం దీని షూటింగ్ దుబాయ్‌లో జరుగుతోంది. షూటింగ్ సెట్ నుండి సల్మాన్ ఖాన్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ లీక్ అయిన ఫోటోలు, వీడియోల్లో సల్మాన్‌తో పాటు తన ఫ్రెండ్ సంజయ్ దత్ కూడా ఉండడం విశేషం. కాకపోతే ఇందులో సల్మాన్ కాస్ట్యూమ్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. లీక్ అయిన వీడియోల్లో తను ఒక ఆటో డ్రైవర్ గెటప్‌లో కనిపించాడు.

నిజమా? కాదా?

ఇన్నేళ్లుగా సల్మాన్ ఖాన్ (Salman Khan) తన హాలీవుడ్ డెబ్యూ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఫైనల్‌గా డెబ్యూ చేసే సమయం వచ్చినప్పుడు ఒక ఆటో డ్రైవర్ పాత్రలో తను కనిపించడం ఫ్యాన్స్‌కు నచ్చకపోవచ్చని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. అయితే అసలు ఇది నిజంగానే హాలీవుడ్ మూవీ షూటింగా లేక సల్మాన్ అప్‌కమింగ్ సినిమాకు సంబంధించిన షూటింగా అనే సందేహాలు కూడా ఫ్యాన్స్‌లో మొదలయ్యాయి. దీనిపై తనే స్వయంగా ఒక అప్డేట్ ఇచ్చేవరకు ఒక క్లారిటీ రాదని ఫీలవుతున్నారు. మొత్తానికి ప్రస్తుతం సల్మాన్ ఖాన్ దుబాయ్‌లోనే చక్కర్లు కొడుతున్నాడు. తాజాగా ఒక ఈవెంట్‌కు కూడా హాజరయ్యాడు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×