BigTV English

Salman Khan : లారెన్స్ బిష్ణోయ్ కి సల్మాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ ఓపెన్ ఆఫర్

Salman Khan : లారెన్స్ బిష్ణోయ్ కి సల్మాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ ఓపెన్ ఆఫర్

Salman Khan : ప్రస్తుతం ఎక్కడ చూసినా సల్మాన్ ఖాన్ (Salman Khan)కు ఎదురవుతున్న హత్య బెదిరింపుల గురించే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) పేరు మార్మోగిపోతోంది. సల్మాన్ ఖాన్ ఆప్తమిత్రుడైన ఎన్సిపి నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య తర్వాత ఈ గ్యాంగ్ గురించి దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. సిద్ధిఖీ హత్య తర్వాత నెక్స్ట్ టార్గెట్ సల్మాన్ ఖాన్ అంటూ బిష్ణోయ్ గ్యాంగ్ ఓపెన్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఆయనకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ముంబై పోలీసులు. ఈ నేపథ్యంలోనే తాజాగా సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు సదరు గ్యాంగ్ స్టర్ పేరును ప్రస్తావిస్తూ ఓ సంచలన పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. పైగా అందులో ఆమె ఒక ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చారు.


సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు సోమి అలీ (Somy Ali) తన ఇంస్టాగ్రామ్ లో ‘లారెన్స్ బిష్ణోయ్ నమస్తే… జైల్లో ఉన్నప్పటికీ మీరు జూమ్ కాల్స్ మాట్లాడతారని నేను విన్నాను. మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? దయచేసి మీ మొబైల్ నెంబర్ ఇస్తే కొన్ని విషయాల గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. రాజస్థాన్ నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం.. నేను ప్రార్థన కోసం మీ ఆలయాన్ని సందర్శించాలనుకుంటున్నాను, అయితే ఈ చాట్ మీ మంచి కోసం నన్ను నమ్మండి, నేను కృతజ్ఞతతో ఉంటాను’ అంటూ ఆమె చేసిన పోస్ట్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం లారెన్స్ గుజరాత్ జైల్లో ఉండగా, సల్లూ భాయ్ మాజీ లవర్ సోమీ అలీ పెట్టిన ఈ పోస్ట్ క్షణంలో వైరల్ కాగా, ఆ తర్వాత ఆమె ఈ పోస్ట్ ని డిలీట్ చేసినట్టుగా తెలుస్తోంది.

సోమీ అలీ ఎవరంటే పాకిస్తానీ అమెరికన్ నటి. గతంలో ఆందోళన్, మాఫియా వంటి పలు బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే సల్మాన్ ఖాన్ (Salman Khan) సరసన నటించే ఛాన్స్ కూడా పట్టేసింది. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అయితే అప్పట్లో సల్మాన్ ఖాన్ సోమీ అలీ మధ్య ప్రేమాయణం నడిచిందని బీ టౌన్ లో రూమర్లు వినిపించాయి. ఓ ఇంటర్వ్యూలో సోమీ అలీ తనకు సల్మాన్ ఖాన్ ఇష్టమని, అతనికి ఆ విషయాన్ని చెప్పానని కూడా వెల్లడించింది. కొంతకాలం వీరు ఇరువురు డేటింగ్ చేసినట్టుగా వార్తలు వినిపించాయి కానీ ఆ తర్వాత విడిపోయారు.


అయితే విడిపోయారు అనే వార్తలు వినిపించిన తర్వాత సోమీ అలీ (Somy Ali) సల్మాన్ ఖాన్ పై సంచలన కామెంట్స్ చేసింది. అతను ఒక మానసిక రోగి అంటూ అమ్మాయిలను దారుణంగా హింస్తాడని చెప్పుకొచ్చింది. పైగా అతనికి వ్యతిరేకంగా ఉంటే సినిమా ఇండస్ట్రీలో కెరీర్ లేకుండా చేస్తాడని, అతన్ని అభిమానించడం మానేయాలంటూ ఫైర్ అయింది. అప్పట్లో ఆ పోస్ట్ తీవ్ర దుమారం రేపడంతో తొలగించింది. తాజాగా మరోసారి గ్యాంగ్స్టర్ లారెన్స్ కి ఓపెన్ మెసేజ్ పెట్టి మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×