BigTV English
Advertisement

Trivikram Srinivas : గురూజీకి కథ చెప్పడం అంత తేలికా.?

Trivikram Srinivas : గురూజీకి కథ చెప్పడం అంత తేలికా.?

Trivikram Srinivas : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే గురూజీ అనగానే డౌట్ లేకుండా పక్కన గుర్తొచ్చే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. స్వయంవరం సినిమాతో రచయితగా కెరియర్ మొదలు పెట్టిన త్రివిక్రమ్ అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన సినిమాలను రాసి రచయితగా తనకంటూ ఒక స్థాయిని ఏర్పాటు చేసుకున్నారు. కేవలం పాస్టర్ మీద త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుని చూసి సినిమాలు కి వెళ్ళిన ఆడియన్స్ ఉన్నారు అని చెప్పడం కూడా అతిశయోక్తి కాదు. రచయితగా కెరియర్ పీక్లో ఉన్న టైంలో నువ్వే నువ్వే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా కంటే ముందు అతడు అనే సినిమాను మహేష్ బాబుకి చెప్పాడు త్రివిక్రమ్. అయితే ఆ సినిమా చేసేద్దాం అనుకునే లోపే స్రవంతి రవి కిషోర్ కి మొదటి సినిమా చేస్తాను అని మాట ఇవ్వడం వలన నువ్వే నువ్వే సినిమాను చేసి ఆ తర్వాత అతడు సినిమా చేశాడు త్రివిక్రమ్.


అతడు సినిమా అప్పట్లో కమర్షియల్ గా హిట్ కాకపోయినా కూడా దర్శకుడుగా త్రివిక్రమ్ కి 100% మార్కులు వేసింది. ఆ సినిమా తర్వాత కేవలం స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తూ స్టార్ డైరెక్టర్ తెలుగు శ్రీనివాస్. తన కెరియర్లో కేవలం రెండు సినిమాలు మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ కూడా కేవలం స్టార్ హీరోస్తోనే చేశాడు. ఇక రీసెంట్ టైమ్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లు తప్ప ఇంకో బ్యానర్ లో సినిమాలు చేయట్లేదు. ద్వీపం శ్రీనివాస్ కి హారిక హాసిని క్రియేషన్స్ అనేది హోం బ్యానర్. ఆ బ్యానర్ కి అనుసంధానంగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కూడా నిర్మించారు. ఈ బ్యానర్లో సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా సినిమాలు చేస్తూ ఉంటారు. అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్ వైఫ్ సాయి సౌజన్య సహనిర్మాతగా వ్యవహరిస్తూ ఉంటారు. అందువలన ఈ బ్యానర్ లో జరిగే కొన్ని సినిమా కథలను త్రివిక్రమ్ వింటూ ఉంటారు.

ప్రస్తుతం ఈ బ్యానర్లు లక్కీ భాస్కర్ అనే సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నాడు దర్శకుడు వెంకి అట్లూరి. ఒక ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ కథను ఎవరికి చెప్పడం కష్టం అని అడిగితే. చిన్న బాబు గారు నాగ వంశీ త్రివిక్రమ్ వీళ్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి కథను చెప్పడం చాలా ఈజీ అంటూ చెబుతూ వచ్చాడు వెంకీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కథను కరెక్ట్ గా అర్థం చేసుకుంటారు. అలానే సినిమాకి సంబంధించిన చాలా వాల్యూడ్ క్వశ్చన్స్ వేస్తారు. అలానే లక్కీ భాస్కర్ విషయంలో అసలు ఏం క్వశ్చన్ చేయకుండా ఫస్ట్ సిటింగ్ లోనే ఓకే చేసేసారు అంటూ వెంకీ అట్లూరి చెప్పుకొచ్చాడు. ఇక లక్కీ భాస్కర్ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ప్రేక్షకులు ముందుకు రానుంది.


లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి BIGTV Whats APP Channelని ఫాలో అవ్వండి. ఈ కింద లింక్ క్లిక్ చేయండి 👇

https://whatsapp.com/channel/0029VaAe49e72WTw8YM6zr3q

 

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×