BigTV English

Samantha: విడాకుల తరువాత ఆ పని చేసినందుకు నేనెప్పుడూ ఫీల్ అవ్వలేదు

Samantha: విడాకుల తరువాత ఆ పని చేసినందుకు నేనెప్పుడూ ఫీల్ అవ్వలేదు

Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం నిదానంగా సినిమాలు చేయడం మొదలుపెట్టింది. గతేడాది మొత్తం రెస్ట్ తీసుకున్న ఈ భామ.. మళ్లీ కెరీర్ మీద ఫోకస్ చేస్తుంది. అమ్మడి చేతిలో ఇప్పుడు సిటాడెల్ సిరీస్ ఒకటి ఉంది. ఇది కాకుండా మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన విషయాలు ఏమి బయటకు రాలేదు.


ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది.. తాజాగా తన విడాకుల సమయంలో జరిగిన ఒక ఘటనను గుర్తుచేసుకుంది. అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత నాలుగేళ్లు కూడా కలిసి లేకుండా విబేధాల వలన విడిపోయారు. ఫ్రెండ్స్ గా ఉంటామని చెప్పారు కానీ, ఇప్పటివరకు వీరిద్దరూ ఎదురెదురు పడడం కూడా జరగలేదు. ఇక ఈ విడాకులకు కారణాలు చాలానే ఉన్నాయని ఎన్నోరకాల వార్తలు వినిపించాయి.

కొంతమంది చై తప్పు చేశాడని.. ఇంకొంతమంది సామ్ తప్పు చేసిందని చెప్పుకొచ్చారు. ఇక విడాకుల తరువాత సామ్.. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ఊ అంటావా మావా.. ఊఊ అంటావా సాంగ్ తెజో అమ్మడు రేంజ్ ఎక్కడికో వెళ్ళింది. కానీ, అంతకుమించిన విమర్శలు కూడా ఎదుర్కొంది. అయితే ఆ సమయంలో ఆ సాంగ్ చేయొద్దని కుటుంబం మొత్తం చెప్పినట్లు సామ్ తెలిపింది.


కేవలం ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కాదు.. ఫ్రెండ్స్, సన్నిహితులు కూడా అదే చెప్పారట. విడాకులు గురించి చర్చలు జరుగుతున్నాయి.. విమర్శలు వస్తున్నాయి.. ఇలాంటి సమయంలో ఐటెం సాంగ్ ఏంటి.. వద్దు అని చెప్పారట. కానీ, సామ్ అవేమి పట్టించుకోకుండా సాంగ్ చేసి షాక్ ఇచ్చింది. ఇక ఇప్పటికీ కూడా ఆ సాంగ్ చేసినందుకు ఎప్పుడు ఫీల్ అవ్వలేదని, అది అంత సక్సెస్ అయ్యినందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం సామ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×