SSMB29 : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో SSMB29 ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం ఇదివరకే రాజమౌళి తెరకెక్కించిన త్రిపుల్ ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించడమే. ఆ సినిమాతో చరణ్ గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సాధించుకున్నాడు. తెలుగు సినిమా స్థాయి అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఊహించని ఆస్కార్ అవార్డు కూడా తెలుగు చిత్ర సీమకు అడుగుపెట్టింది. అంతటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దానికి తోడు సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా అంటే ఏ లెవెల్ లో ఉంటుందో ఊహకు కూడా అందడం లేదు.
షూటింగ్ అప్డేట్
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొంతమేరకు ఒరిస్సాలో జరిగింది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ జనవాడ లో వేసిన సెట్ లో జరుగుతుంది. హైదరాబాద్ శివారులోని జనవాడలో SSMB29 షూటింగ్ జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం వినిపిస్తుంది. దీనికి కోసం భారీ సెట్ వేశారు. ఆ సెట్ లోనే మహేష్ బాబు – ప్రియాంక చోప్రా – పృథ్విరాజ్ సుకుమారన్ పై షూట్ చేస్తున్నారు. పృథ్విరాజ్ సుకుమారన్ పేరుకు మలయాళం హీరో అయినా కూడా తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. నేను చేసిన చాలా సినిమాలు తెలుగు ప్రేక్షకులు కూడా చూశారు. ఇక సలార్ సినిమా తర్వాత పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్న తెలుగు సినిమా ఇది. ఈ కాంబినేషన్ వింటుంటేనే సినిమా మీద అంచనాలు ఇంకా రెట్టింపు అవుతున్నాయి.
ఎప్పుడో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది
పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకుడుగా తెరకెక్కించిన లూసిఫర్ సినిమా మలయాళం లో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఇదే సినిమాకు తెలుగులో దర్శకుడుగా చేయమని అవకాశం వచ్చినా కూడా తను అప్పటికే ఆడు జీవితం అనే సినిమాను చేయడంతో అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక సందర్భంలో అడిగినా కూడా అప్పుడు కూడా రిజెక్ట్ చేశారు. ఎందుకంటే అప్పటికి ఆడు జీవితం సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. దాదాపు 10 ఏళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఆ సినిమా 2024 లో విడుదలైంది. ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించక పోయినా కూడా పృథ్విరాజ్ సుకుమారన్ కు అని మాత్రం మంచి పేరును తీసుకొచ్చింది. ఒక సినిమా మీద ఈ రేంజ్ డెడికేషన్ ఉంటుందా అని ఆ సినిమా అనిపించింది.
Also Read : NTRNeel : షూటింగ్ కి అంతా సిద్ధం, అదిరిపోయే ఫోటోతో అప్డేట్