Samantha:స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ ట్రాక్ ఎక్కేసింది. మియో సైటిస్‌తో బాధపడుతున్నానని ఆమె చెప్పగానే అందరూ బాధపడ్డారు. మళ్లీ షూటింగ్స్‌లో ఆమె పాల్గొంటుందో లేదో తెలియని పరిస్థితి. అయితే సమంత మానసిక ధైర్యంతో కష్టపడింది. సవాళ్లను అధిగమించింది ఇప్పుడు మళ్లీ హీరోయిన్‌గా బిజీగా మారింది. ప్రస్తుతం సామ్‌కి సంబంధించిన వార్తొకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆమె ముంబైలో ఖరీదైన ఫ్లాట్‌ను ఖరీదు చేసిందని. ముంబై బీచ్‌కి అపోజిట్‌గా ఉండే అపార్ట్‌మెంట్‌లో రూ.15 కోట్లు ఖర్చు పెట్టి ఈ చెన్నై బ్యూటీ ఫ్లాట్‌ను దక్కించుకుందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సమంత బాలీవుడ్‌లోనూ అవకాశాలను అందుకుంది. ముంబైలో ఉండటానికి హోటల్స్ కంటే సొంత ఫ్లాట్ ఉంటే బావుంటుందని ఆమె ఆలోచించటంతో ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.
అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయమేమంటే.. బీచ్ ఫేస్‌లో అది కూడా ముంబైలో రూ.15 కోట్లకు ఫ్లాట్ ఎలా వచ్చిందనేది తెలియటం లేదు. తక్కువలో తక్కువగా యాబై కోట్ల ఉంటుందని అలాంటి ఇంత చీప్‌గా సమంతకు ఫ్లాట్ ఎలా దక్కిందనేది ఎవరికీ అంతు చిక్కని విషయం. అయితే ఖరీదైన ఫ్లాట్‌కు ఫైనల్ పేమెంట్‌గా రూ.15 కోట్లు అమౌంట్ ఇచ్చి ఉండొచ్చు. లేదా పూర్తి వార్త అవాస్తవంగానూ ఉండొచ్చు. ప్రస్తుతం బాలీవుడ్ సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో సమంత నటిస్తుంది. దీనికి ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్, డీకే తెరకెక్కిస్తున్నారు.
మరో వైపు ఖుషి సినిమా యూనిట్ సమంత కోసం వెయిట్ చేస్తుంది. ఇది కాకుండా పాన్ ఇండియా మూవీ శాకుంతలంతోనూ సామ్ సందడి మొదలు పెట్టనుంది. నిజానికి శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కావాల్సింది. కానీ అనుకోని కారణాలతో సినిమా వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను గుణ శేఖర్ అండ్ టీమ్ అనౌన్స్ చేస్తారు.