BigTV English

Samantha: స్టైలిష్ కాదు.. చాలా కాస్ట్లీ గురూ.. సమంత వాచ్ ఖరీదు తెలిస్తే షాక్..!

Samantha: స్టైలిష్ కాదు.. చాలా కాస్ట్లీ గురూ.. సమంత వాచ్ ఖరీదు తెలిస్తే షాక్..!

Samantha.. సమంత (Samantha)..జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందనే చెప్పాలి. ఒకవైపు ఇష్టమైన వాడిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. కానీ ఎక్కువ కాలం అతనితో ఉండలేక బయటకు వచ్చేసింది. మరోవైపు మయోసైటీస్ అనే వ్యాధి. ఇప్పటికీ ఈ వ్యాధి నుంచి బయటపడడం కోసం పోరాడుతూనే ఉంది. ఒకవైపు మానసిక ఇబ్బందులు మరొకవైపు శారీరక సమస్యలు అన్నీ కూడా ఆమెను చుట్టుమట్టాయి. అయితే ఇప్పుడిప్పుడే ఆ బాధలన్నీటిని పక్కన పెట్టి మళ్ళీ తనలో ఆత్మవిశ్వాసం నింపుకొని ఇప్పుడే కెమెరా ముందుకు వస్తోంది సమంత. అందులో భాగంగానే వరుస ఫోటోషూట్లు షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.


గ్లోబల్ స్టార్ తో సందడి చేసిన సమంత..

ప్రస్తుతం సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ టీమ్ మెంబర్స్ తో సందడి చేసింది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది సమంత. అంతేకాదు సినిమా రంగంలో హీరోయిన్స్ ప్రతిష్టాత్మకంగా భావించే ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును కూడా అందుకుంది. ఈ శుక్రవారం దుబాయ్ వేదికగా జరిగిన ఐఫా 2024 వేడుకలలో ఈ పురస్కారాన్ని సొంతం చేసుకుంది సమంత. దీంతో ఈమెకు బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ శుభాకాంక్షలు చెబుతూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


సమంత ధరించిన వాచ్ ఖరీదు అన్ని రూ.లక్షలా..

ఈ క్రమంలోనే గత నాలుగు రోజులుగా స్టైలిష్ లుక్స్ లో వరుస ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈవెంట్స్, పార్టీలలో తన స్టైల్ తో అందరిని ఆశ్చర్యపరుస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోని ఒక ఈవెంట్లో తన స్నేహితురాలు క్రేషా బజాజ్ రూపొందించిన అద్భుతమైన పాస్టెల్ గ్రీన్ కో – ఆర్డ్ సెట్ తో ఫ్యాన్స్ కు కన్నుల విందు చేసింది. ఈ డ్రెస్ కు తగినట్లుగా బంగారు చెవి పోగులను ధరించి మరింత ఆకట్టుకుంది. అంతేకాదు తన లుక్ కి తగినట్టుగా విలాసవంతమైన బల్గారీ సర్పెంటీ వాచ్ ధరించి ఆశ్చర్యపరిచింది. ఇది చాలా స్టైలిష్ గా కనిపించడమే కాదు.. దీని ధర తెలిస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే. సమంత ధరించిన ఈ వాచ్ ధర అక్షరాలా రూ.45.5 లక్షలు. ఈ ధర చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాదు సమంత హుందాతనానికి అద్దం పడుతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు కూడా.

ఈవెంట్ కే స్పెషల్ అట్రాక్షన్..

ఇదిలా ఉండగా ఇటీవల లండన్ లో జరిగిన సిటాడెల్ వరల్డ్ పార్టీకి హాజరయ్యింది సమంత. అందులో మరొకసారి అందరి దృష్టిని ఆకట్టుకుంది. క్రేషా బజాజ్ రూపొందించిన అధునాతన నేవీ బ్లూ డ్రెస్ లో కనిపించి ఆకట్టుకుంది. అంతేకాదు ఈ ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ.

మయోసైటిస్ నుంచి బయటపడడం కోసం..

ఇకపోతే తాను ఎదుర్కుంటున్న అనారోగ్య సమస్య మయోసైటిస్ నుంచి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే సినిమాలు తగ్గించింది. నిత్యం యోగా, మెడిటేషన్ చేస్తూ తన ఫాలోవర్లకు ఆరోగ్య సూచనలు కూడా అందజేస్తోంది. మొత్తానికైతే సమంత ది బెస్ట్ అనిపించుకుంటోందనడం లో సందేహం లేదు.

 

View this post on Instagram

 

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×