Intercourse In Plane| చెందిన ఇద్దరు ప్రేమికులు విమానంలో శృంగారం చేస్తుండగా పట్టుబడ్డారు. విమానంలో ముగ్గురు ప్రయాణికులు చూస్తుండగానే వారిద్దరూ ఈ పని చేశారు. ఆ తరువాత విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయగా.. ఇద్దరినీ విమానం నుంచి దింపేశారు. ఎయిర్ పోర్ట్ పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు .
వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ దేశంలోని బ్రిస్టల్ నగరానికి చెందిన ఇద్దరు బ్రాడ్లే స్మిత్ (22), అంటోనియా సుల్లివాన్ (20) మార్చి 2024లో స్పెయిన్ లో హాలిడే కోసం వెళ్లారు. స్పెయిన్ లోని టెనిరైఫ్ దీవుల్లో హాలిడే ఎంజాయ్ చేసి తిరిగి బ్రిస్టల్ చేరేందుకు వారు ఈజీ జెట్ ఫ్లైట్ విమానం ఎక్కారు. అయితే విమానంలో వారిద్దరూ 16a, 16b సీట్లలో కూర్చొన్నారు. 16c సీట్లో మరొ వ్యక్తి కూర్చొన్నాడు. వారి వెనకాల సీట్లో ఒక మహిళ, ఆమె టీనేజ్ కూతురు కూర్చున్నారు.
విమానం ఇంకా ఎయిర్ పోర్ట్ లో నిలబడి ఉండగానే.. స్మిత్ తన గర్ల్ ఫ్రెండ్ ఆంటోనియాతో సైగలు చేశాడు. తనకు విమానంలో శృంగారం చేయాలనుందని చెప్పాడు. అందుకు ఆంటోనియా కేవలం ఓరల్ చేస్తానని చెప్పింది. అలా స్మిత్ కూర్చొని ఉండగానే అతని ఒడిలో శాలువ, విమానంలో ఇచ్చే బ్లాంకెట్ కప్పుకొని ఆంటోనియా అతనికి ఓరల్, హ్యాండ్ జాబ్ చేయసాగింది. అయితే ఇదంతా పక్క సీటులో కూర్చొని ఉన్న వ్యక్తి గమనించాడు. చూసి చూడనట్టు వదిలేశాడు. వారిద్దరూ చేస్తున్న పనికి స్మిత్ సీటు కదులుతోంది.
Also Read: ప్రభుత్వ ఉద్యోగం ఉంది, వధువు కావలెను’.. 50 మహిళలను మోసం చేసిన ముగ్గురు పిల్లల తండ్రి!
ఏం జరుగుతోందా?.. అని వెనుక సీటులో కూర్చొని ఉన్న టీనేజర్ అమ్మాయి వారిని చూసింది. వారిద్దరూ ఏదో చేస్తున్నారని తన తల్లికి చెప్పింది. దీంతో వెనుక సీట్లో కూర్చొన్న మహిళ కూడా లేచి ఆ యువప్రేమికులిద్దరూ ఓరల్ శృంగారం చేస్తున్నట్లు గమనించింది. ఆ మహిళ తన కూతురు ఇదంతా చూసి ప్రశ్నలు అడుగుతుండడంతో విసుగు చెంది.. విమాన సిబ్బందికి పిలిచి ఫిర్యాదు చేసింది. ముందు వరుసల కూర్చొని ఉన్న యువ జంట విమానంలో అందరూ చూస్తుండగానే ఓరల్ శృంగారం చేస్తున్నారని చెప్పింది.
విమాన సిబ్బంది కూడా అది గమనించి. ఆంటోనియా, స్మిత్ ని విడిగా పిలిచి ప్రశ్నించారు. అయితే స్మిత్, ఆంటోనియా తాము అలాంటిదేమీ చేయలేదని.. కేవలం కౌగిలించుకున్నామని అన్నారు. స్మిత్ కు ఏదో కాలు నొప్పి ఉంటే తాను మర్దన చేస్తున్నానని ఆంటోనియా తెలిపింది. వారి సమాధానంలో సంతృప్తి చెందని విమాన సిబ్బంది వారిని విమానం నుంచి కిందకు దింపేసి పోలీసులకు అప్పగించారు.
పోలీసులు వారిపై పబ్లిక్ డీసెన్సీ నిబంధనలను ఉల్లంఘించినందుకు, విమానంలో అనుమతిలేని పనులు చేసినందుకు కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసులో ఇద్దరు ప్రేమికులకు కోర్టు శిక్ష విధించింది. వారి చర్యల వల్ల మానసికంగా డిస్టర్బ్ అయిన ముగ్గురికీ (పక్క సీటు వ్యక్తి, తల్లీ కూతుళ్లకు) తలా వంద పౌండ్లు చెల్లించాలని.. విమానంలో శృంగారం చేసినందుకు బ్రాడ్లే స్మిత్ కు 300 గంటలు, ఆంటోనియా కు 270 గంటలు సమాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొనాలని శిక్ష విధించింది.
Also Read: పండుగ రోజు విషాదం.. ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి
శిక్ష విధిస్తూ.. న్యాయమూర్తి లిన్ మ్యాథ్యూస్ ఇలా అన్నారు. ”పబ్లిక్ లో అలా చేయాలని మీకు ఎలా అనిపించింది. మీ ప్రవర్తన వల్ల పక్క ప్యాసెంజర్లకు ఇబ్బంది కలుగుతుందని తెలిసి కూడా మీరు ఈ పని చేశారు. పైగా వెనుక సీట్లో కేవలం 13 ఏళ్ల అమ్మాయి కూర్చొని ఉంది. ఆమె కళ్లారా మీ చర్యలు చూసింది. మిమ్మల్ని మీరు ఏమనుకుంటున్నారు?.. విమానంలో అందరి ముందు అలా ప్రవర్తించే హక్కు మీకెవరిచ్చారు? ” అని న్యాయమూర్తి మండిపడ్డారు. ఈ ఘటన గురించి ఇటీవలే ప్రముఖ బ్రిటీష పత్రిక ‘ది సన్’ లో కథనం ప్రచురించారు.