Indian Railways: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు ఏకంగా పాక్ భూభాగంలోకి వెళ్లి మరీ క్షిపణి దాడులకు పాల్పడింది. మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు కేంద్రంగా ఈ దాడులను నిర్వహించింది. నిషేధిత జైష్-ఎ-మొహమ్మద్ బలమైన స్థావరం అయిన బహవల్పూర్ తో సహా పలు ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతం అయినట్లు తెలుస్తోంది. ఈ దాడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. శ్రీనగర్ విమానాశ్రయంతో పాటు ఇండో-పాక్ సరిహద్దుల్లోని పలు విమానాశ్రయాల్లో విమాన రాకపోకలను నిలిపివేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విమానాలు నడపకూడదని ఆదేశించింది.
కాశ్మీర్ లో చిక్కుకున్న వారి కోసం ప్రత్యేక రైళ్లు
ఆపరేషన్ సిందూర్ ఉద్రిక్తతల నేపథ్యంలో కాశ్మీర్ లో చిక్కుకున్న పర్యాటకులు, ఇతర ప్రయాణీకులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాశ్మీర్ లోయలో రైలు కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు. బారాముల్లా, శ్రీనగర్, బనిహాల్ లాంటి కీలక స్టేషన్లను కలుపుతూ కాశ్మీర్ లోయ అంతటా 22 రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించారు. వీటి ద్వారా ప్రయాణీలు కాశ్మీర్ ను వదిలి వెళ్లాలని సూచించారు.
Read Also: జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన ప్రాంతాలు, సమ్మర్ లో ప్లాన్ చేసేయండి!
కాశ్మీర్ నుంచి అందుబాటులో ఉన్న రైళ్ల వివరాలు
⦿ బారాముల్లా – సంగల్దాన్ DMU: ఈ రైలు(74620) బారాముల్లా నుంచి మధ్యాహ్నం 2:40 గంటలకు బయలుదేరి సాయంత్రం 6:55 గంటలకు సంగల్దాన్ చేరుకుంటుంది.
⦿ బుద్గాం-బనిహాల్ DMU: ఈ రైలు నంబర్(74628) బుద్గాం నుంచి సాయంత్రం 6:10 గంటలకు బయలుదేరి సాయంత్రం 6:20 గంటలకు బనిహాల్ చేరుకుంటుంది.
⦿ బారాముల్లా-బనిహాల్ DMU: ఈ రైలు(74626) బారాముల్లా నుంచి ఉదయం 07:00 గంటలకు బయలుదేరి ఉదయం 10:00 గంటలకు బనిహాల్ చేరుకుంటుంది.
⦿ బుద్గాం-బారాముల్లా DMU రైలు నంబర్ 74631 బుద్గాం నుండి మధ్యాహ్నం 15:40 గంటలకు బయలుదేరి సాయంత్రం 4:50 గంటలకు బారాముల్లా చేరుకుంటుంది. వీటితో పాటు సుమారు మొత్తం 22 రైళ్లను కాశ్మీర్ లోయలో నడుపుతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రజలు, ప్రయాణీకులు, టూరిస్టులు ఈ రైలు సేవలను వినియోగించుకోవచ్చని సూచించారు. ఆయా రైల్వే స్టేషన్లలో తగిన భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Read Also: ఈ రైలు ప్రపంచమంతా తిరిగేస్తుంది.. సింగపూర్ నుంచి ఆ దేశానికి ఎన్ని రోజుల్లో చేరుతుందంటే?