BigTV English

Samantha: ఇండస్ట్రీకి 15 ఏళ్లు.. అరుదైన సత్కారం.. కానీ..!

Samantha: ఇండస్ట్రీకి 15 ఏళ్లు.. అరుదైన సత్కారం.. కానీ..!

Samantha..ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నాగచైతన్య హీరోగా నటించిన ‘ఏ మాయ చేసావే’ సినిమాలో నటించి, ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే జెస్సీగా అందరి హృదయాలు దోచుకున్న ఈమె, ఆ పాత్రతో కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకుందని చెప్పవచ్చు. 2010 ఫిబ్రవరి 26వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే అటు సమంత కూడా టాలీవుడ్లోకి అడుగుపెట్టి 15 సంవత్సరాలయిన సందర్భంగా ఆమెను ఒక ప్రముఖ సంస్థ తాజాగా ఘనంగా సత్కరించింది. కానీ మళ్లీ సమంత అలాంటి రూమర్స్ ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


అరుదైన సత్కారం..

చెన్నైకి చెందిన ఈ చిన్నది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 సంవత్సరాలు పూర్తి కావడంతో.. ఎన్సీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రతినిధులు సమంతకు అవార్డు అందజేశారు. బిహైండ్ వుడ్స్ గోల్డ్ అందించే “హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు”ను సమంతా కు అందజేశారు. ఇక చెన్నైలో జరిగిన వేడుకలలో సమంతకు అవార్డు లభించడంతో ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అంతేకాదు గత ఏడాది ‘సిటాడెల్ – హనీ బన్నీ’ వెబ్ సిరీస్ కి కూడా ఆమెకు మరో అవార్డు లభించింది. ఇలా 2 అవార్డులు అందుకోవడంతో సమంత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ.. సమంతపై ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఏది ఏమైనా ఇండస్ట్రీలో కొచ్చి 15 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ అదే క్రేజ్ తో దూసుకుపోవడం నిజంగా ప్రశంసనీయమని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.


డైరెక్టర్ తో డేటింగ్ వార్తలు..

ఇదిలా ఉండగా.. సమంత ఇటీవల ‘సిటాడెల్ హనీ బన్నీ’, ‘ది ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ లో డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో డేటింగ్ లో ఉందంటూ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల చెన్నైలో జరిగిన పికిల్ బాల్ టోర్నమెంట్లో కూడా వీరిద్దరూ జంటగా కనిపించారు. దీనికి తోడు తాజాగా సమంతకు అందించిన అవార్డు ఫంక్షన్లో కూడా హనీ బన్నీ డైరెక్టర్ రాజ్ నిడిమోరు, డీకే కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే మరొకసారి సమంతపై డేటింగ్ రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ అవార్డు వచ్చిన వేళ కూడా అలాంటి పుకార్లకు సమంత తావు ఇచ్చిందని అభిమానులు ఫీల్ అవుతున్నారు. అయితే ఈ వార్తలపై అటు సమంత, ఇటు రాజ్ ఎవరూ కూడా స్పందించలేదు. ఏది ఏమైనా సమంత ఇప్పుడు ఇలాంటి డేటింగ్ వార్తలు ఎదుర్కోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సమంత కెరియర్..

ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తున్న సమంత.. చివరిగా సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించిన ఈమె.. ఇప్పుడు తెలుగులో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో నటిస్తూ , నిర్మిస్తోంది. కానీ ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ బయటకు రాలేదు. ఇక మరొకవైపు హిందీలో రక్థ్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది సమంత. ఇక ఈ వెబ్ సిరీస్ కూడా ఆర్థిక కారణాల వల్ల ఆగిపోయింది అనే వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×