BigTV English

SSMB 29: ప్రియాంక సర్ప్రైజ్ రోల్.. ఫ్యాన్స్‌కి మెంటలెక్కిపోవడం ఖాయం భయ్యా

SSMB 29: ప్రియాంక సర్ప్రైజ్ రోల్.. ఫ్యాన్స్‌కి మెంటలెక్కిపోవడం ఖాయం భయ్యా

Priyanka Chopra: ప్రస్తుతం తెలుగు నుండి ఎన్నో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఆ సినిమాలకు సంబంధించి ఒక్క అప్డేట్ వచ్చినా చాలు అన్నట్టుగా ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాంటి సినిమాల్లో రాజమౌళి, మహేశ్ బాబు సినిమా కూడా ఒకటి. తెలుగు దర్శకుల్లో ముందుగా పాన్ ఇండియా రేంజ్ పాపులారిటీ సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి. అలాంటి రాజమౌళి ఏ మూవీ తెరకెక్కిస్తున్నా కూడా దానిపై ఫోకస్ పెరగడం ఖాయం. ఇక మహేశ్ బాబుతో రాజమౌళి సినిమా అనగానే ఆ అంచనాలు ఒక రేంజ్‌లో ఉన్నాయి. ఇక ఇందులో ప్రియాంక చోప్రా నటిస్తుందా లేదా, ఏంటి అప్డేట్ అనే విషయంపై తన తల్లి మధు చోప్రా తాజాగా స్పందించారు.


హీరోయిన్‌గా కన్ఫర్మ్

మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’ సినిమాలో హీరోయిన్ ఎవరు అని ప్రేక్షకుల్లో ముందు నుండే చర్చలు మొదలయ్యాయి. ఇక ఇందులో హీరోయిన్‌గా ఒక బాలీవుడ్ బ్యూటీని తీసుకుంటారని తెలియగానే అది ఎవరు అయ్యింటారా అని అందరూ చాలా గెస్‌లు చేశారు. మొత్తానికి అనూహ్యంగా ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’లో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా ఎంపికయ్యింది. ఈ విషయాన్ని మేకర్స్ సీక్రెట్‌గా ఉంచాలని అనుకున్నా ఏదో ఒక విధంగా బయటికొచ్చింది. దీంతో రాజమౌళి పోస్ట్‌కు ప్రియాంక ట్వీట్ చేసి తను ఈ ప్రాజెక్ట్‌లో భాగమయిన విషయాన్ని తానే స్వయంగా బయటపెట్టింది. తాజాగా ఈ విషయంపై తన తల్లి కూడా స్పందించారు.


రివీల్ చేయకూడదు

ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తల్లి మధు చోప్రా (Madhu Chopra) తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’లో ప్రియాంక ఉందా లేదా అనే ప్రశ్న ఎదురయ్యింది. దానికి సమాధానంగా ‘‘తను షూటింగ్‌లో పాల్గొంటోంది’’ అని చెప్పుకొచ్చారు మధు చోప్రా. అంటే ప్రియాంక చోప్రా హైదరాబాద్‌లో అడుగుపెట్టడానికి ఆ షూటింగే కారణమా అని అడగగా దానికి ఆమె నిజమే అన్నట్టుగా తల ఊపారు. ప్రస్తుతం ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’కు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న కథనాల ప్రకారం ప్రియాంకది ఒక నెగిటివ్ రోల్ అని, తనకు, హీరోకు మధ్య కీలక సన్నివేశాలను ప్రస్తుతం హైదరాబాద్‌లో తెరకెక్కిస్తున్నారని సమాచారం.

Also Read: ఆ తప్పుడు వీడియోలతో నాకు సంబంధం లేదు.. ‘డర్టీ పిక్చర్’ బ్యూటీ కామెంట్స్

చాలాకాలం తర్వాత

అమెరికన్ సింగర్, యాక్టర్ అయిన నిక్ జోనస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియాంక చోప్రా కూడా పూర్తిగా అమెరికాలోనే సెటిల్ అయిపోయింది. పెళ్లయిన ఇన్నేళ్లలో తను చాలా తక్కువసార్లు మాత్రమే ఇండియాకు వచ్చింది. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నా ఇప్పుడు ఆ బాలీవుడ్‌కు కూడా దూరమయ్యింది. అలాంటిది తనను మళ్లీ ఇండియన్ సినిమాల్లో చూస్తారని ఫ్యాన్స్ అస్సలు ఊహించలేదు. ఉన్నట్టుండి తనకు ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’ ఆఫర్ రావడం, దానికి తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షూటింగ్ కోసం ఇండియా రావడం చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ మూవీలో ప్రియాంకతో పాటు మరో హీరోయిన్ కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×