E-Paper
Advertisement

Samantha : “ఎన్నో అబద్దాలు.. ఇంకెన్నో అవమానాలు.. ఇదే డివోర్స్ తర్వాత నా జీవితం” – సమంత

Samantha : “ఎన్నో అబద్దాలు.. ఇంకెన్నో అవమానాలు.. ఇదే డివోర్స్ తర్వాత నా జీవితం” – సమంత
Advertisement

Samantha : టాలీవుడ్ లో స్టార్ కపుల్ సమంత, నాగచైతన్య 2017లో వివాహం చేసుకున్నారు. ఎంతో క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. గత నెలలో నాగచైతన్య.. శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అయినప్పటికీ సమంత – నాగచైతన్య విడాకులకు సంబంధించిన వార్తలు ఇప్పటికీ హాట్ టాపిక్ గానే మారుతున్నాయి. తాజాగా మరోసారి ఈ విషయంపై సమంత స్పందించింది.

ఏ మాయ చేసావే (2010) సినిమాతో దగ్గరైన సమంత – నాగచైతన్య పెళ్లి అనంతరం పలు కారణాలతో 2021లో విడాకులు తీసుకున్నారు. అప్పట్లో ఈ విషయం ఓ సంచలనంగా మారింది. ఇలాంటి క్యూట్ కపుల్ విడిపోవడం బాధగా ఉందంటూ సెలబ్రెటీలతో పాటు ఫాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు సమంత, నాగచైతన్య పలుమార్లు విడాకులకు గల కారణాలపై స్పందిస్తూనే వచ్చారు. వ్యక్తిగత కారణాలతో విడిపోయామని చెప్పుకొచ్చారు. విడాకుల తర్వాత నాగచైతన్య, శోభితా ధూళిపాళ్లను పెళ్లి చేసుకున్నారు. సమంత మాత్రం ఇప్పటికీ నాగచైతన్యను మర్చిలేకోపోతుంది. విడాకుల తర్వాత పడిన బాధను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూనే వచ్చింది. తాజాగా మరోసారి ఈ విషయంపై స్పందించిన సమంత.. విడాకుల తర్వాత తనకు ఏదైనా పరిస్థితుల గురించి తెలిపింది.

Advertisement

“నాగచైతన్యతో విడాకుల తర్వాత చాలా బాధపడ్డా. నిజానికి భర్తతో విడిపోయిన మహిళను ఈ సమాజం ఎలా చూస్తుందో బాగా తెలుసుకున్నా. నా గురించి ఎన్నో అబద్ధాలు సృష్టించారు. ఈ అబద్దాలతో ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యా.. చాలాసార్లు అందులో నిజం లేదని చెప్పాలనిపించేది. అయితే నాతో నేను చేసుకున్న సంభాషణే నన్ను ఎన్నోసార్లు ఆపింది. డివోర్స్ తర్వాత బాధగా అనిపించినా ఏ రోజూ ఏడుస్తూ కూర్చోలేదు. ధైర్యాన్ని కోల్పోలేదు. నా జీవితంలో మరో అధ్యాయం కోసం ఎదురుచూస్తున్నా..” అంటూ సమంత తెలిపారు.

తాజాగా సమంత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె ఫ్యాన్స్ ధైర్యంగా ఉండాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. తప్పకుండా కొత్త జీవితం ఉంటుందని.. ఆనందంగా లైఫ్ లో ముందుకు వెళ్లాలంటూ తెలుపుతున్నారు.

Advertisement

నిజానికి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ స్టేటస్ అందుకున్న నటిమణుల్లో సమంత మొదటి స్థానంలో ఉంటుంది. ఒకానొక సమయంలో ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత.. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో సైతం నటిస్తూ మంచి పేరు సంపాదించుకుంది. లేడి ఓరియంటెడ్ చిత్రాల్లో సైతం నటించింది. ఆమె నటించిన ఓ బేబీ, శాకుంతల, యశోద చిత్రాలు మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ వెబ్ సిరీస్ సో మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది సమంత. ప్రస్తుతం కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సమంత సినిమాల విషయంలో జోరు తగ్గించిందనే చెప్పాలి. ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది.

ALSO READ :  దిల్ రాజు ను కాపాడిన బుల్లి రాజు… ఇప్పుడు ఇదే ట్రెండింగ్

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×