India China Relations : ఇటీవల గాల్వాన్ లోయలో భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. ఇరు దేశాల మధ్య కీలక విదేశాంగ ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. జనవరి 26-27 తేదీల్లో బీజింగ్ లో పర్యటించారు. అక్కడ విదేశాంగ కార్యదర్శితో సమావేశమయ్యారు. ఇందులోనే.. ఇరుదేశాలు ఈ ఏడాది వేసవిలో కైలాష్ మానస సరోవర్ యాత్రను పునః ప్రారంభించేందుకు అంగీకారానికి వచ్చాయి. ఈ భేటిలో తాజా నిర్ణయంతో రెండు దేశాల మధ్య సంబంధాలను పునర్నిర్మించే ప్రయత్నాలకు సూచికగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గత ఏడాది అక్టోబరులో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పరస్పర చర్చల తర్వాత ఈ సమావేశం జరగడం విశేషం. ఈ సమావేశం ద్వారా భారత్-చైనా సంబంధాలను స్థిరీకరించడం, బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ జనవరి 27న భారత్, చైనాల మధ్య విదేశాంగ కార్యదర్శి – వైస్ ఫారిన్ మినిస్టర్ మెకానిజం సమావేశమయ్యారు. కజాన్‌లో జరిగిన వారి సమావేశంలో ప్రధాన మంత్రి మోదీ, అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య సమావేశంలో నిర్ణయించినట్లుగా ఇరుపక్షాలు ద్వైపాక్షిక సంబంధాల స్థితిని సమగ్రంగా సమీక్షించాయి. ఇందులో భాగంగా.. ప్రజలకు అనుకూలమైన విధానాల ద్వారా ప్రారంభించాలని నిర్ణయించారు.
ఇప్పటికే ఉన్న ఒప్పందాల ప్రకారం అలా కైలాస సరోవర యాత్రకు ప్రజలను అనుమతించే విషయమై విధివిధానాలపై అధికార యంత్రాంగం చర్చిస్తుంది. ఇరు దేశాల మధ్య ఏళ్లుగా సాగుతున్న నదుల్లోని నీటి పారుదల లెక్కల విషయమై చర్చకు వచ్చాయి. సరిహద్దు నదులపై సహకారాన్ని పెంపొందించడం గురించి చర్చించడానికి భారత్-చైనా నిపుణుల స్థాయి మెకానిజం ముందస్తు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి.
ఈ సమావేశంలో ఇరు దేశాల పౌరుల సంబంధాల గురించి చర్చింనట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించేందుకు చేపట్టాల్సిన విషయంపై చర్చించారు. ఇందులో భాగంగా.. రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను పునరుద్ధరించాలని నిర్ణయించారు. అలాగే.. మిగతా విషయాల్లో సంబంధాలను పునరుద్ధరించేందుకు, కావాల్సిన కార్యచరణను ఖరారు చేసేందుకు రెండు వైపుల నుంటి టెక్నికల టీమ్స్ సమావేశం కావాలని నిర్ణయించాయి. ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహనను ప్రోత్సహించడానికి మీడియా, థింక్-ట్యాంక్ పరస్పర చర్యలను మెరుగుపరచాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, స్మారక కార్యకలాపాలను నిర్వహించడం, ప్రజా దౌత్య ప్రయత్నాలను బలోపేతం చేయడం కోసం రెండు దేశాలు 2025లో ప్రభావితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు.
ఆర్థిక, వాణిజ్య అంశాలపై చర్చలు
భారత్, చైనా ఉన్నత స్థాయి విదేశాంగ కార్యదర్శుల సమావేశంలో ఇప్పటికే ఉన్న వ్యవస్థీకృత విధానాలపై అధికారులు చర్చించారు. పరస్పరం కీలక సమస్యల పరిష్కారానికి ద్వైపాక్షిక సంభాషణలను క్రమంగా పునఃప్రారంభించేందుకు అంగీకరించాయి. విధాన పర నిర్ణయాలు, పారదర్శకతను నిర్ధారించడానికి రెండు వైపుల నుంచి నిర్దిష్ట సవాళ్లను పరిష్కరించాలని, ఇందులో ఆర్థిక, వాణిజ్య సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఉన్నత స్థాయి సమావేశాలు విదేశాంగ కార్యదర్శి మిస్రీ, చైనా సీనియర్ అధికారులతో చర్చలు జరిపారు. HE వాంగ్ యి, విదేశాంగ మంత్రి, చైనా కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అంతర్జాతీయ శాఖ మంత్రి HE లియు జియాంచావో పాల్గొన్నారు.