BigTV English

Janhvi Kapoor : ఇంత సింపుల్ శారీని జాన్వీ అన్ని లక్షలు పోసి కొనుక్కుందా ?

Janhvi Kapoor : ఇంత సింపుల్ శారీని జాన్వీ అన్ని లక్షలు పోసి కొనుక్కుందా ?

Janhvi Kapoor : బాలీవుడ్ బుట్ట బొమ్మ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఏం చేసినా సరే ఇట్టే వైరల్ అవుతుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ వైట్ శారీ కట్టి, హొయలు పోయింది. ఆమె చీర కట్టుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, ఆ సింపుల్ వైట్ శారీ కోసం జాన్వీ కపూర్ లక్షలు ఖర్చు చేసిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ చీర ఖర్చు ఎంత ? ఎందుకు జాన్వీ అంత ఖర్చు పెట్టింది ? అనే వివరాల్లోకి వెళ్తే…


ఒక్క చీరకే లక్షల్లో ఖర్చు

సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాన్వి కపూర్ (Janhvi Kapoor) రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆమె తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహరియాతో కలిసి ఉన్న ఫోటోలు నెటిజన్లను బాగా ఆకర్షిస్తాయి. అందుకే ఆమె ఆ ఫోటోలను పోస్ట్ చేసిన క్షణాల్లోనే లక్షల్లో వ్యూస్ వస్తాయి. అయితే ఇటీవలవరుస సినమలతో బిజీగా ఉన్న జాన్వీ  సినిమాలకు బ్రేక్ ఇచ్చి కేరళ టూర్ కి వెళ్ళింది. ఆ టైంలో జాహ్నవి కపూర్ ఒక తెల్లటి లెనిన్ శారీ ధరించి, దేవకన్యలా కనిపించింది. ఇంకేముంది ఆమె కట్టుకున్న అందమైన చీర ధర ఎంత అని ఆరా తీయడం మొదలు పెట్టారు నెటిజెన్లు. ఈ నేపథ్యంలోని జాన్వి కపూర్ కట్టుకున్న వైట్ లెనిన్ శారీ ధర అక్షరాల రూ. 2,47,000 అని తెలుస్తోంది. అంతేకాదు ఈ చీర అనవిలా అనే బ్రాండ్ కు సంబంధించిందని సమాచారం. దీంతో ఇంత సింపుల్ శారీనీ జాన్వి అన్ని లక్షలు పోసి కొన్నదా? అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.


టాలీవుడ్ పైనే ఫోకస్ అంతా… 

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ‘ధడక్’ అనే సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన జాన్వి కపూర్ (Janhvi Kapoor), యూత్ ఫేవరెట్ గా మారడానికి ఎక్కువ టైం ఏమీ తీసుకోలేదు. ఘోస్ట్ స్టోరీస్, రోగి, గుడ్ లక్, జెర్రీ వంటి హిందీ సినిమాలతో కోట్లాది మంది అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకుంది.

ఇక ఈ అమ్మడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తుండగా, ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’తో తెలుగులోకి అడుగు పెట్టింది. అలాగే ఈ మూవీతోనే పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది జాన్వీ. ప్రస్తుతం ఈ బ్యూటీ ఖాతాలో వరుస సినిమాలు ఉన్నాయి. రామ్ చరణ్ తో కలిసి ‘ఆర్సీ 16’అనే సినిమాలో నటిస్తోంది. మరోవైపు అక్కినేని అఖిల్ నెక్స్ట్ మూవీ లో కూడా జాన్వినే హీరోయిన్ అని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా ఈ బ్యూటీ కోలీవుడ్ లో కూడా అడుగు పెట్టబోతోంది. ఇక తాజాగా జాన్వి పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లల్ని కనాలని ఉందని, తిరుపతిలోనే సెటిల్ కావాలని ఉందని కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×