Indian Railways: రైలు ప్రయాణం మొదలైనప్పటి నుంచి ఆఖరి స్టేషన్ కు వరకు ప్రయాణీకులంతా భద్రంగా వెళ్లాలంటే.. ఎంతో మంది కో ఆర్డినేషన్ అవసరం. లోకో పైలెట్ మొదలు కొని రైల్వే గేట్ గార్డులు, స్టేషన్ మాస్టర్లు, కంట్రోలర్లు సమన్వయంతో పని చేస్తేనే రైలు, ఒక చోటు నుంచి మరొక చోటుకు జాగ్రత్తగా వెళ్తుంది. ఎవరు ఏమాత్రం అలసత్వం వహించిన ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసే అవకాశం ఉంటుంది. అందుకే, ఆయా రూట్లలో రైలు ఎలా వెళ్లాలి? ఎంత వేగంతో వెళ్లాలి?ఎక్కడ పక్కకు ఆపి అత్యవసర రైళ్లు వెళ్లేందుకు దారి ఇవ్వాలి? అనేది పక్కాగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నీ తెలిసేలా, ఆయా రూట్లలో చాలా ఇండికేషన్ బోర్డులు ఏర్పాటు చేస్తుంటారు. లోకో ఫైలెట్లు వాటిని ఫాలో అవుతుంటారు. ఆలాంటి వాటిలో ఒకటి FM బోర్డు. ఇంతకీ ఈ బోర్డు వల్ల కలిగే లాభం ఏంటి? దాన్ని ఎందుకు వాడుతారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
FM బోర్డుతో కలిగే లాభం ఇదే!
సాధారణంగా రైల్వే స్టేషన్ సమీపంలో రెండు వైపుల FM బోర్డులు ఉంటాయి. రెండు ట్రాక్ ల మధ్య ఈ బోర్డులను అమర్చుతారు అధికారు. FM అంటే.. పౌలింగ్ మార్క్ అని పిలుస్తారు. సాధారణంగా రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో కొన్ని రైళ్లను పక్కన ఆపి, వెనుక వచ్చే రైళ్లను ముందు పంపిస్తారు. అలా పంపించాలంటే పక్కపక్కన రెండు ట్రాక్ లు ఉండాలి. ముందుగా ఆపాలి అనుకున్న రైలును సైడ్ ట్రాక్ లోకి తీసుకుంటారు. అలా తీసుకున్న సమయంలో చివరి బోగీ ఈ FM బోర్డును దాటాల్సి ఉంటుంది. అలా దాటినప్పుడు మాత్రమే, ముందు ఉన్న రైలును వెనుక వచ్చే రైలు డ్యాష్ ఇవ్వకుండా ఉంటుంది. అలా FM బోర్డు దాటిన తర్వాత మాత్రమే, వెనుక వచ్చే రైలు ముందు వెళ్లాలని సిగ్నల్ ఇస్తారు స్టేషన్ మాస్టర్. అప్పుడే, ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యవసర రైలు వెళ్లిపోతుంది. ఈ బోర్డులు రైల్వే స్టేషన్ కు ఇరువైపులా ఉంటాయి.
Read Also: రైల్వేలో ముందు కొత్త ట్రాక్ వేయరు, ఎందుకో తెలుసా?
ఇక రైళ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయడానికి రైల్వే అధికారులు ట్రాక్ వెంట బోలెడు ఇండికేషన్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. అలాంటి వాటిలో విజిల్ బోర్డులు, సిగ్మా బోర్డులు, స్పీడ్ ఇండికేషన్ బోర్డులు సహా రకరకాల బోర్డులు దర్శనం ఇస్తుంటాయి. లోకో పైలెట్లు ఈ ఇండికేషన్ బోర్డులను ఫాలో అవుతూ రైలును ముందుకు తీసుకెళ్తాడు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని రైలును నడిపినప్పుడే ఎలాంటి ఇబ్బంది లేకుండా గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే, రైలు సురక్షితంగా చివరి స్టేషన్ కు చేరడంలో టీమ్ వర్క్ అనేది ఉంటుంది. అందరూ తమ విధులను సక్రమంగా నిర్వర్తించినప్పుడే రైలు ప్రయాణీకులను క్షేమంగా వారి గమ్యస్థానాలకు తీసుకెళ్తుంది.
Read Also: రైల్వేలో W/D బోర్డులు కనిపిస్తాయి.. వీటిని ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా?