Samantha: ఇటీవల కొండా సురేఖ.. నాగార్జున, నాగచైతన్య, సమంతపై చేసిన ఆరోపణలు హాట్ టాపిక్‌గా మారాయి. ఆ తర్వాత ఈ ఘటన ఎన్నో మలుపులు తిరిగింది. ఆమె చేసిన కామెంట్స్ ఈ రేంజ్‌లో వైరల్ అవుతాయని కొండా సురేఖ కూడా ఊహించి ఉండరు. ఒక్కసారిగా సినీ సెలబ్రిటీలు అంతా ఒక్కటయ్యి ఆమె చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ముందుగా నాగార్జున.. ఈ విషయంపై స్పందించడానికి ముందుకు రాగా.. ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీ నుండి ఒక్కొక్కరుగా కొండా సురేఖ కామెంట్స్‌పై స్పందించడం మొదలుపెట్టారు. ఇక ఈ కాంట్రవర్సీ మధ్యలో ఇంటి నుండి దూరంగా వెళ్లిపోయింది సమంత.
కాంట్రవర్సీ మధ్యలో
ప్రస్తుతం సమంత చుట్టూ పెద్ద కాంట్రవర్సీనే తిరుగుతోంది. కొండా సురేఖ చేసిన కామెంట్స్.. సమంతను కించపరిచేలా ఉన్నాయని చాలామంది సినీ సెలబ్రిటీలు తనకు సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు. కొండా సురేఖ ఒక మంత్రి స్థానంలో ఉండి మరో మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై కొండా సురేఖ కూడా స్పందించక తప్పలేదు. తాను అలా కావాలని అనలేదని, ఒక వ్యక్తిని విమర్శించే క్రమంలో ఒక కుటుంబం గురించి కొన్ని మాటలు అనేశానని ఒప్పుకున్నారు. ముఖ్యంగా సమంతకు ప్రత్యేకంగా క్షమాపణ చెప్పారు. ఇవన్నీ పట్టించుకోకుండా సమంత.. సద్గురు ఆశ్రమానికి వెళ్లిపోయింది.
Also Read: సమంతను వెంటాడుతున్న అక్టోబర్ బ్యాడ్ లక్… డివోర్స్ నుంచి నేటి వరకు వరుస వివాదాలు
మనశ్శాంతి కోసమే
సమంత.. సద్గురును అమితంగా ఫాలో అవుతుంది. సద్గురు చెప్పే విషయాలను అప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తుంది. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో కొండా సురేఖ కాంట్రవర్సీ నడుస్తున్న సమయంలో మనశ్శాంతి కోసం సద్గురు ఈషా ఫౌండేషన్‌కు వెళ్లిపోయింది సామ్. ‘ఇది కూడా నాకు ఇల్లు లాంటిదే’ అంటూ బుధవారం రాత్రి తన సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేసింది. అంతే కాకుండా ఈ పోస్ట్‌లో తను ఈషా ఫౌండేషన్‌ను కూడా ట్యాగ్ చేసింది. దీంతో సమంత మనశ్శాంతి కోసమే అక్కడికి వెళ్లిందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు.
తప్పు లేదేమో
ఒకప్పుడు సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేది. తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉండేది. తనకు నచ్చిన కోట్స్‌ను కూడా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల ద్వారా షేర్ చేసేది. కానీ విడాకుల తర్వాత తనకు సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ ఏర్పడింది. అసలు నాగచైతన్యతో తన విడాకుల విషయంలో ఎవరి తప్పు ఉందనే విషయం బయటికి రాలేదు. అయినా చాలామంది సమంతదే తప్పు అన్నట్టుగా తనను నిందించడం మొదలుపెట్టారు. అప్పటినుండి కొంతకాలం పాటు తను సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా లేదు. ఫైనల్‌గా ఇన్నాళ్లకు కొండా సురేఖ కాంట్రవర్సీ వల్ల అసలు విడాకుల విషయంలో నిజంగానే సమంత తప్పేమీ లేదేమో అని చాలామంది ప్రేక్షకులు ఫీల్ అవ్వడం మొదలుపెట్టారు.