BigTV English

Samantha: తల్లి కావాలని ఉంది.. హాట్ బాంబ్ పేల్చిన సమంత..!

Samantha: తల్లి కావాలని ఉంది.. హాట్ బాంబ్ పేల్చిన సమంత..!

Samantha : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు సమంత (Samantha). ప్రస్తుతం హిందీలో ‘ సిటాడెల్ – హనీ బన్నీ’ (Citadel – Honey Bunny) అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ వెబ్ సిరీస్‌లో సమంత తన యాక్షన్ పర్ఫామెన్స్‌తో విపరీతంగా ఆకట్టుకోగా.. అలాగే లిప్ లాక్ సన్నివేశాలలో కూడా రెచ్చిపోయి మరీ నటించింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ లో తాను తల్లి పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ పాత్ర గురించి మాట్లాడుతూ.. తన మనసులో కోరిక బయటపెట్టింది సమంత.


సమంత మాట్లాడుతూ..”నాకు తల్లి కావాలనే కలలు ఉన్నాయి. అమ్మగా ఉండడానికి నేను ఎంతో ఇష్టపడతాను. అయితే ఇందుకు ఆలస్యమైందని కూడా నేను అనుకోవట్లేదు. ప్రస్తుతం నేను జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను” అంటూ తాను తల్లి కావాలనే కోరికను బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. దీన్ని బట్టి చూస్తే సమంత రెండో పెళ్లికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు హింట్ ఇచ్చింది అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి సమంత తల్లి కావాలి అంటే ఇంకో పెళ్లి చేసుకోక తప్పదు. మరి ఈమె జీవితంలోకి సినిమా రంగానికి చెందిన వారే వస్తారా? లేక బయట వ్యక్తులను వివాహం చేసుకుంటుందా? అనేది తెలియాల్సి ఉంది.

కశ్వీ మజ్ముందర్ పై ప్రశంసలు..


అలాగే ఈ వెబ్ సిరీస్ లో తన కూతురిగా నటించిన కశ్వీ మజ్ముందర్ పై ప్రశంసల వర్షం కురిపించింది. “కశ్వీ మజ్ముందర్” చాలా తెలివైన అమ్మాయి. అద్భుతంగా హావభావాలు పలికించింది” అంటూ కొనియాడింది సమంత.

సిటాడెల్ – హనీ బన్నీ వెబ్ సిరీస్..

హిందీ భాషా స్పై యాక్షన్ వెబ్ సిరీస్ గా వచ్చిన ‘సిటాడెల్ – హనీ బన్నీ’ వెబ్ సిరీస్ కి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. నవంబర్ 6వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. గతంలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కి ప్రీక్వెల్ ఇది. ప్రియాంక తల్లిదండ్రులు హనీ – బన్నీ ల చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో వరుణ్ ధావన్ (Varun Dhawan) కీలకపాత్ర పోషించగా.. సమంత రుతు ప్రభ టైటిల్ రోల్ పోషించింది. వీరితోపాటు కేకే మీనన్, సికిందర్ కేర్, సిమ్రాన్, సాకీబ్ సలీం ,సోహం మజుందార్, శివన్ కిత్ సింగ్ పరిహార్ , తలైవాసన్ విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మొత్తం ఆరు ఎపిసోడ్లు కలిగిన ఈ వెబ్ సిరీస్ ని సయ్యద్ జైద్ అలీ నిర్మించారు.

సమంత కెరియర్..

సమంత విషయానికొస్తే.. ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై.. మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న సమంత.. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఈమె వివాహం జరిగిన నాలుగేళ్లకే విడాకులు తీసుకొని ఇప్పుడు కెరియర్ పైన ఫోకస్ పెట్టింది. ఇక తల్లి కావాలంటూ కోరిక బయటపెట్టిన సమంత త్వరలోనే పెళ్లి చేసుకుని ఆ కోరికను తీర్చుకుంటుందేమో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×