Ram Gopal Varma : రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) అంటే వివాదం వివాదం అంటే రాంగోపాల్ వర్మ అన్న విషయం టాలీవుడ్ మూవీ లవర్స్ కి బాగా తెలుసు. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలవడం అన్న విషయంలో ఆయన తర్వాతే ఎవరైనా. విషయం ఏదైనా సరే తనను తాను ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండేలా చూసుకుంటాడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్. కానీ తాజాగా వర్మకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. తాజాగా మరోసారి ఈ వివాదాస్పద డైరెక్టర్ పై కేసు నమోదు కావడం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
సినిమాలతో వర్మ (Ram Gopal Varma) ఎంత పాపులారిటీని సంపాదించుకున్నారో వివాదాల్లో కూడా అంతకంటే ఎక్కువగానే నిలిచారు. అయితే తాజాగా రాంగోపాల్ వర్మకు షాక్ ఇచ్చే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. తాజాగా ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో రాంగోపాల్ వర్మపై కేసు నమోదయింది. ‘వ్యూహం‘ (Vyuham) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అప్పట్లో ప్రతిపక్ష నేత ప్రస్తుతం సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బ్రాహ్మిణిల వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ తెదేపా మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ మేరకు ఆయనపై పోలీసులు ఐటి చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తును స్టార్ట్ చేశారు.
అయితే వివాదం ఏంటంటే రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా రిలీజ్ కి ముందే వివాదాలకు దారి తీసింది. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఆయన ఈ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సెన్సార్ పూర్తయినప్పటికీ, తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సినిమాలోని పాత్రలు తమను కించపరిచే విధంగా ఉన్నాయి అంటూ తెలంగాణ హైకోర్టులో ఈ సినిమా రిలీజ్ ను ఆపాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరో రెండు నెలల్లో జరగనున్నాయి అన్న తరుణంలో ఈ సినిమా వివాదం చిచ్చురేపింది. 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం నుంచి మొదలుపెట్టి ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవరకు ఈ సినిమా ను రూపొందించారు ఆర్జీవి. మొత్తానికి పలు వివాదాల అనంతరం సినిమా అయితే రిలీజ్ అయ్యింది అనుకోండి. కానీ గత ప్రభుత్వం సపోర్ట్ వల్ల ఇష్టం వచ్చినట్టు వర్మ సినిమాలు తీశాడు. అలాగే నోటికి అడ్డూ అదుపూ లేకుండా కామెంట్స్ కూడా చేశాడు. కానీ ఇప్పటి ఏపీ ప్రభుత్వం అతని నోటికి అడ్డుకట్ట వేసే ఛాన్స్ ఉంది. దానికి నిదర్శనమే తాజాగా నమోదైన కేసు అని టాక్ నడుస్తోంది. మరి ఈ కేసు విషయమై ఇప్పుడు రాం గోపాల్ వర్మ ఎలా స్పందిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది.