BigTV English

Samantha: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన స‌మంత‌

Samantha: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన స‌మంత‌

Samantha:రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత కాంబినేష‌న్‌లో ‘ఖుషి’ అనే సినిమా గత ఏడాదిలోనే మొద‌లైన సంగ‌తి తెలిసిందే. భార్య భ‌ర్త‌ల మ‌ధ్య ఎమోష‌న్స్‌ను ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఖుషి సినిమాను కొంత పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన త‌ర్వాత స‌మంత మ‌యోసైటిస్ బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. చాలా రోజుల పాటు స‌మంత హాస్పిట‌ల్‌కే ప‌రిమిత‌మైంది. అయితే ఆమె చాలా క‌ష్ట‌ప‌డి నార్మ‌ల్ మ‌నిషిగా మారింది. ఈ క్ర‌మంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. అండ్ ఖుషి టీమ్ స‌మంత కోసం ఎదురు చూస్తూ కూర్చుకున్నారు.


అయితే స‌మంత మాత్రం రాజ్ అండ్ డీకే రూపొందిస్తోన్న బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘సిటాడెల్’ సెట్స్‌లో జాయిన్ అయిన సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక అప్డేట్ రావ‌టంతో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ షాక‌య్యారు. ఖుషి సంగ‌తి ఏమైందంటూ స‌మంత‌ను క్వ‌శ్చ‌న్ చేశారు. అయితే స‌మంత అందుకు వారికి క్ష‌మించాలంటూ సోష‌ల్ మీడియా ద్వారా రిప్ల‌య్ ఇచ్చింది. త్వ‌ర‌లోనే తాను విజ‌య్ దేవ‌ర‌కొండ ఖుషి సెట్స్‌లోకి అడుగు పెడ‌తానంటూ చెప్పుకొచ్చింది. మరో వైపు విజయ్ దేవరకొండ సైతం సమంత పూర్తి ఆరోగ్యంతో ఖుషి సెట్స్‌లోకి అడుగు పెడుతుందని భావిస్తున్నట్లు ట్వీట్ చేశారు. మరి ఖుషి సినిమా షూటింగ్‌లో జాయిన్ కావటానికి సమంత ఇంకెన్ని రోజులు తీసుకుంటుందో చూడాలి మరి. మరో వైపు లైగర్ తర్వాత ఖుషి సినిమా కోసం వెయిట్ చేసిన విజయ్ దేవరకొండ త్వరలోనే గౌతమ్ తిన్ననూరి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లటానికి ప్లాన్ చేసుకుంటున్నారు.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×