Sampoornesh Babu: సినీ పరిశ్రమలో హీరో అవ్వాలంటే మంచి హైట్ ఉండాలి, కలర్ ఉండాలి, గ్లామర్ ఉండాలి, డ్యాన్స్ రావాలి.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. కానీ ఇలాంటి క్వాలిటీస్ లేకపోయినా ఇండస్ట్రీలో హీరోలుగా అడుగుపెట్టి స్టార్లుగా వెలిగిపోతున్నవారు చాలామంది ఉన్నారు. వారంతా కేవలం తమ యాక్టింగ్‌తో ప్రేక్షకుల మనసులకు దగ్గరయ్యారు. అలాంటి వారిలో సంపూర్ణేశ్ బాబు ఒకడు. సంపూర్ణేశ్ బాబు ముందుగా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వెంటనే అసలు ఇతను హీరో అవ్వడమేంటి అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినా కూడా కొన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. అలాంటి సంపూ గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉండడానికి కారణమేంటో తాజాగా బయటపెట్టాడు.
ఏంటా కారణం?
‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు సంపూర్ణేశ్ బాబు. ఆ మూవీ అసలు హిట్ అవుతుందని, దానివల్ల తనకు హీరోగా గుర్తింపు వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఈ సినిమా సెన్సేషనల్ హిట్ సాధించింది. అంతే కాకుండా సంపూకు బర్నింగ్ స్టార్ అనే ట్యాగ్ వచ్చేలా చేసింది. అలా ‘హృదయ కాలేయం’ తర్వాత కూడా సంపూర్ణేశ్ నటించిన ఒకట్రెండు సినిమాలు ప్రేక్షకులను బాగానే అలరించాయి. అయినా కూడా గత కొన్నేళ్లుగా తన సినిమాల్లో అంత యాక్టివ్‌గా ఉండడం లేదు. మళ్లీ ఇంతకాలం తర్వాత ‘సోదర’ అనే మూవీతో థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే సినిమాల నుండి గ్యాప్ రావడానికి సంపూ ఆరోగ్య సమస్యలే కారణమా అనే విషయంపై తను తాజాగా క్లారిటీ ఇచ్చాడు.
బడ్జెట్ దాటిపోయింది
సంపూర్ణేశ్ బాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నాడని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. వాటిపై క్లారిటీ ఇచ్చేశాడు. ‘‘ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు లేవు. ఈ గ్యాప్‌లో సినిమాలు కూడా జరిగాయి. ఇంకో రెండు సినిమాలు రిలీజ్‌కు రెడీ ఉన్నాయి. ఈశ్వర్ రెడ్డి తెరకెక్కించిన ఒక సినిమాలో నేను అయిదు క్యారెక్టర్లు చేశాను. కానీ అది కరెక్ట్ టైమ్‌కు రాలేదు. అందులో ఎక్కువ గ్రాఫిక్స్ వర్క్ ఉంది. అలా నిర్మాత అనుకున్న దానికంటే బడ్జెట్ చాలా దాటిపోయింది. దాంతో పాటు ఇంకొక సినిమా ఉంది’’ అంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు విడుదల కాకపోవడానికి కారణాన్ని బయటపెట్టాడు సంపూర్ణేశ్ బాబు.
Also Read: పేరుతో పని లేదు.. తింటూనే ఉంటుంది.. త్రిష పరువు తీసిన కమల్
వాటికి రీచ్ కాలేదు
‘‘సోదర మూవీ కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయ్యింది. ప్రస్తుతం సోదర ఒకటి ఉంది. దాంతో పాటు రెండు రిలీజ్‌కు రెడీ ఉన్నాయి. ఇంకొకటి సెట్స్‌పై ఉంది. ఇప్పటికీ హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాలు ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. దాన్ని ఇంకా ఏ సినిమా రీచ్ కాలేదు కాబట్టి సినిమాలు చేయట్లేదేమో అనుకుంటున్నారు. దానికి మనం ఏం చేయలేం’’ అని చెప్పుకొచ్చాడు సంపూర్ణేశ్ బాబు. హీరోగా సంపూర్ణేశ్ బాబు (Sampoornesh Babu) దాదాపు అరడజనుకు పైగా సినిమాల్లో నటించాడు. దాంతో పాటు తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షో ప్రారంభం కాగానే అందులో మొదటి సీజన్‌లోనే కంటెస్టెంట్‌గా కనిపించి అలరించాడు.