Kamal Haasan: చాలావరకు సినీ సెలబ్రిటీల మధ్య ఎంత సాన్నిహిత్యం ఉన్నా ఆఫ్ స్క్రీన్ దానిని పెద్దగా చూపించుకోరు. పైగా ఒకరి గురించి ఒకరు మర్యాదగా మాట్లాడుతూ ఉంటారు. కానీ తాజాగా సీనియర్ హీరో కమల్ హాసన్ మాత్రం త్రిష పరువు తీసేశారు. ప్రస్తుతం త్రిష, కమల్ హాసన్, శింబు.. అందరూ కలిసి ‘థగ్ లైఫ్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఆ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ, ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. అలా ఒక ప్రెస్ మీట్ సమయంలో త్రిషను ఆటపట్టిస్తూ ఒక మాట అనేశారు కమల్ హాసన్. అది వినడానికి చాలా సరదాగా అనిపించినా కమల్.. త్రిష పరువు తీసినట్టుగా ఉందని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమోషన్స్ మొదలు
మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమానే ‘థగ్ లైఫ్’. ఈ మూవీ కోసం దాదాపు 24 ఏళ్ల తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కలిశారు. వీరిద్దరి కాంబోలో ఇప్పటివరకు తెరకెక్కింది ఒక్క సినిమానే అయినా అది ఒక ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌గా మిగిలిపోయింది. అందుకే ఈ ఇద్దరు సీనియర్లు కలిసి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమా తీస్తారా అని తమిళ ప్రేక్షకులు తెగ ఎదురుచూసేవారు. వారు ఆశపడినట్టుగానే ఫైనల్‌గా మళ్లీ వీరిద్దరూ కలిశారు. ‘థగ్ లైఫ్’ తెరకెక్కించారు. ఈ మూవీలో కమల్‌కు జోడీగా త్రిష నటించగా యంగ్ హీరో శింబు విలన్ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ మూవీ విడుదలకు ఇంకా సమయం ఉన్నా అప్పుడే ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు.
ఊహించని కౌంటర్
‘థగ్ లైఫ్’ (Thug Life) ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా కమల్ హాసన్, త్రిష (Trisha), శింబు కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో తనకు ఫుడ్ అంటే ఎంత ఇష్టమో చెప్తూ ఒక ఆహార పదార్థం గురించి ప్రస్తావించింది త్రిష. ఆ సమయంలోనే కమల్ హాసన్ తనకు కౌంటర్ ఇచ్చారు. పరంబురి అనే ఆహార పదార్థం తనకు చాలా ఇష్టమని చెప్పడానికి చాలా కష్టపడింది త్రిష. ఎంతుకంటే తనకు టక్కున దాని పేరు గుర్తురాలేదు. అదే సందర్భంలో ‘‘పేరు చెప్పడం తెలియదు. కానీ తినడం తెలుసు’’ అని కౌంటర్ ఇచ్చారు కమల్ హాసన్. దీంతో అక్కడున్న ప్రేక్షకులు ఒక్కసారిగా నవ్వారు. ఆ కౌంటర్‌ను ఊహించని త్రిష కూడా నవ్వుతూనే స్పందించింది.
Also Read: మహేశ్ బాబు, పృథ్విరాజ్ సుకుమారన్ మధ్య కీలక సీన్స్, షూటింగ్ ఎక్కడంటే.?
ఫ్యాన్స్ ఫైర్
త్రిష పరువు తీసినట్టుగా అనిపించినా కూడా ఆ స్టేట్‌మెంట్‌కు తను కూడా నవ్వింది. అంతే కాకుండా అక్కడే ఉన్న యాంకర్ కూడా కమల్ హాసన్ చాలా ఫన్నీ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. అలా అందరి ముందు ఫన్నీగా ఇచ్చిన స్టేట్‌మెంట్ చాలావరకు త్రిష ఫ్యాన్స్‌కు నచ్చలేదు. ఒక స్టార్ హీరో అయినా కూడా సరదాగా ఎలాంటి కామెంట్స్ చేయాలో తెలియదా అంటూ కమల్ హాసన్‌పైనే సీరియస్ అవుతున్నారు. మొత్తానికి కమల్ హాసన్ (Kamal Haasan) కూడా ఎప్పుడూ తనపై వచ్చే నెగిటివ్ కామెంట్స్‌ను పెద్దగా పట్టించుకోరు. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంటారు. తన పర్సనల్ లైఫ్‌పై ఎన్ని కామెంట్స్ వచ్చినా ప్రొఫెషనల్ లైఫ్‌పై ఎఫెక్ట్ పడనివ్వరు కమల్.