Viral News: క్రికెట్ ( Cricket) అంటేనే ఎంటర్టైన్మెంట్. ఇండియాలో ప్రతి ఒక్కరు క్రికెట్ ఆడడం లేదా చూడడం చేస్తూ ఉంటారు. అయితే.. ఈ క్రికెట్లో… చాలా ఫన్నీ ఇన్సిడెంట్ జరుగుతుంటాయి. ఫ్యాన్స్ కొట్టుకోవడం, క్రికెటర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, లేదా బూతులు తిట్టుకోవడం…. కను సైగలతో… ఒకరినొకరు చూసుకోవడం… ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు క్రికెట్ లో జరుగుతాయి. ఇక మరికొన్ని సమయాలలో వికెట్ తీస్తే బౌలర్లు రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా ఓ బౌలర్ చేసిన పని.. నవ్వులు పూయించింది.
బట్టలు విప్పి సెలబ్రేట్ చేసుకున్న బౌలర్
వికెట్ ( Wicket) తీయగానే బౌలర్ కచ్చితంగా సంబరపడిపోతాడు. కొంతమంది బౌలర్లు రెచ్చిపోయి సెలబ్రేషన్స్ ( Celebrations) చేసుకుంటారు. లేదా వికెట్ తీసిన తర్వాత ఆ బ్యాటర్ను ( Batter).. రెచ్చగొడుతూ కాస్త ఓవర్ చేస్తారు బౌలర్లు ( Bowlers). అయితే తాజాగా ఓ బౌలర్.. వికెట్ తీయలేదు కానీ… బ్యాటర్ను… ఒక్క పరుగు తీయకుండా బంతి మాత్రం విసిరాడు. ఆ బౌలర్ విసిరిన బంతిని… మహేంద్ర సింగ్ ధోనీ ( Mahendhra Singh Dhoni) తరహాలో హెలికాప్టర్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు బ్యాటర్. కానీ ఆ బంతి సరిగ్గా తగలకుండా… మిస్ అయి పోయింది. ఈ నేపథ్యంలో ఆ బ్యాటర్ పూర్తిగా డిసప్పాయింట్ అయ్యాడు. ఇంకేముంది బౌలర్ రెచ్చిపోయాడు. రెచ్చిపోయి ఎవరు ఊహించని విధంగా సెలబ్రేట్ చేసుకున్నాడు.
మొదట తన షు విప్పేశాడు. ఆ తర్వాత తన షర్ట్ విప్పేసి… రచ్చ రచ్చ చేశాడు. షర్ట్ విప్పి ఆగుతాడు అనుకుంటే అక్కడితో మనోడు ఆగలేదు. లోపల ఉన్న బనియన్ కూడా.. విప్పేసి సిగ్నేచర్ సెలబ్రేషన్ ( Signature Celebration )… చేసుకొని గ్రౌండ్ లో ఆగమాగం చేశాడు. గ్రౌండ్ మొత్తం తిరుగుతూ… ఏదో వరల్డ్ కప్ సాధించిన రీతిలో రెచ్చిపోయాడు. ఇక అతని సెల బ్రేషన్స్ చూసిన తోటి క్రికెటర్లు నవ్వుకున్నారు. అటు ఫీల్డ్ అంపైర్లు కూడా… వీడికి పిచ్చా అన్నట్టుగా… అవాకయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
దారుణంగా కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్
ఇక ఈ వీడియోను చూసిన నేటిజన్స్, క్రికెట్ అభిమానులు ( Cricket Fans ) రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి విన్ని తీసుకొచ్చారు… అండమాన్ నికోబార్ దీవుల నుంచి తీసుకు వచ్చారా ? గ్రౌండ్లో పిచ్చిపిచ్చిగా డాన్సులు చేస్తున్నాడు అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. వెంటనే ఆ బౌలర్ను పిచ్చాసుపత్రిలో చేర్చాలని మరి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ అరుదైన సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ఉదయం నుంచి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.
What kind of celebration is this 😅 pic.twitter.com/UzGBSpsMxR
— Richard Kettleborough (@RichKettle07) April 21, 2025