Allu Arjun – Trivikram movie : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. స్వయంవరం సినిమాతో రచయితగా కెరియర్ మొదలు పెట్టిన త్రివిక్రమ్, తన కెరియర్లో రచయితగానే అద్భుతమైన పేరు సాధించుకున్నాడు. ఆ తర్వాత తరుణ్ హీరోగా చేసిన నువ్వే నువ్వే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా చేసిన అతడు సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ హాలీవుడ్ లెవెల్ లో ఉంది అంటూ ఇప్పటికీ త్రివిక్రమ్ మీద ప్రశంసలు వస్తుంటాయి. ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రతిసారి కూడా అతడు సినిమాకి మంచి టిఆర్పి రేటింగ్ వస్తుంది.
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కెరియర్లో నితిన్, తరుణ్ మినహాయిస్తే మిగతా అన్ని సినిమాలు కేవలం స్టార్ హీరోస్ తో మాత్రమే చేసాడు. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ల ప్రస్తావన వస్తే ఎస్.ఎస్ రాజమౌళి త్రివిక్రమ్ శ్రీనివాస్ పేర్లు వినిపించేవి. కానీ ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి సుకుమార్ అని అనుకుంటున్నారు. దీనికి కారణం ఇప్పటివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ పాన్ ఇండియా రేంజ్ లో తన సినిమాను చేయకపోవడమే. నెక్స్ట్ అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉండబోతుంది అని చెప్పుకొచ్చాడు నిర్మాత నాగ వంశీ. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద అటువంటి సినిమాను ఎవరు ఊహించి ఉండరు అంటూ కూడా ఆ సినిమా గురించి చెప్పాడు. రీసెంట్ గా ఈ సినిమా గురించి సముద్రఖని కూడా రెస్పాండ్ అయ్యారు. అన్నయ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి నాకు కచ్చితంగా కాల్ వస్తుంది. నేను సినిమా చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు.
త్రివిక్రమ్ మరియు సముద్రఖని మధ్య ఉన్న బాండింగ్ గురించి చాలామందికి తెలిసింది. స్వతహాగా తమిళ్లో సముద్రఖని కూడా దర్శకుడు కావడంతో వారిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అందుకని బ్రో సినిమాకి త్రివిక్రమ్ సైతం రైటింగ్ లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పడిపోయిన ప్రతిసారి అంతకంటే వేగంగా పైకి లేచే క్యారెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2018లో జనవరి నెలలో అజ్ఞాతవాసి సినిమా విడుదలైంది అది భారీ డిజాస్టర్ అయింది. అయితే ఎక్కువ టైం తీసుకోకుండా అదే సంవత్సరంలో అరవింద సమేత వీర రాఘవ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాడు. త్రివిక్రమ్ కెరియర్ లో అది గ్రేట్ కం బ్యాక్ అని చెప్పాలి. మరి అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాతో త్రివిక్రమ్ ఏ రేంజ్ టచ్ చేస్తాడు అని చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.
Also Read : Yogi Babu: అసలు యాక్సిడెంటే జరగలేదా.? క్లారిటీ ఇచ్చేసిన కమెడియన్..