Yogi Babu: కోలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నారు యోగి బాబు. గత కొన్నేళ్ల నుండి అసలు యోగి బాబు డేట్స్ దొరకడమే మేకర్స్‌కు కష్టమయిపోయింది. అలా ఆయన బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో విపరీతంగా బిజీగా గడిపేస్తున్నాడు. ఇలాంటి సమయంలోనే ఆదివారం ఉదయం తనకు యాక్సిడెంట్ అయ్యిందంటూ వార్తలు బయటికొచ్చాయి. అంతే కాకుండా యాక్సిడెంట్ ఫుటేజ్ ఇదేనంటూ పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ఫ్యాన్స్ అంతా చాలా కంగారుపడ్డారు. అసలు యోగి బాబుకు యాక్సిడెంట్ ఎలా అయ్యింది, తను ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటూ అభిమానులు ఆందోళన చెందుతుండడంతో దీనిపై క్లారిటీ ఇవ్వడానికి యోగి బాబు స్వయంగా ముందుకొచ్చారు.
స్వయంగా క్లారిటీ
యోగి బాబు వరుసగా సినిమాలు చేస్తున్నా ఏడాదికి తను నటించిన ఎన్నో చిత్రాలు విడుదల అవుతున్నా కూడా తను మాత్రం సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండడు. ప్రమోషన్స్‌లో కూడా పెద్దగా పాల్గొనడు. అలాంటి యోగి బాబుకు యాక్సిడెంట్ అయ్యింది అనగానే అది నిజమా కాదా అని తెలుసుకోకుండానే చాలామంది ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. తను త్వరగా కోలుకోవాలని పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. అలా తను ఎలా ఉన్నాడో తెలుసుకోవడానికి సోషల్ మీడియా కూడా వారికి ఆధారం కాలేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా యోగి బాబుకు యాక్సిడెంట్ అయిన మాట నిజమే అని చూపిస్తుండడంతో ఈ విషయంపై యోగి బాబు క్లారిటీ ఇచ్చాడు.
అవన్నీ నమ్మకండి
తనకు యాక్సిడెంట్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మెసేజ్‌ను షేర్ చేస్తూ.. ‘నేను క్షేమంగానే ఉన్నాను. ఇవి అబద్ధపు వార్తలు’ అని చెప్పుకొచ్చాడు యోగి బాబు. దీంతో ఫ్యాన్స్ కాస్త కుదుటపడ్డారు. అసలు ఈ ఫేక్ న్యూస్ ఎక్కడ నుండి మొదలయ్యింది అనేదానిపై కొత్తగా చర్చలు మొదలుపెట్టారు. సోషల్ మీడియా వల్ల ఏది నిజమైన వార్త, ఏది ఫేక్ న్యూస్ అని తెలుసుకునే ఛాన్స్ లేకుండానే పోతుందని వాపోతున్నారు. ప్రస్తుతం యోగి బాబు చేతి నిండా దాదాపుగా అరజడనకు పైగా సినిమాలు ఉన్నాయి. వరుసగా ప్రతీ సినిమాలో కమెడియన్‌గా నటిస్తూ హీరోలకంటే బిజీగా గడిపేస్తున్నాడు యోగి బాబు.
Also Read: టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్న నమ్రత సోదరి.. ఏ సినిమాతో అంటే.?
తెలుగులో డెబ్యూ
యోగి బాబు (Yogi Babu) కమెడియన్‌గా మాత్రమే కాదు.. హీరోగా కూడా పలు సినిమాల్లో, వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్‌లో నటించి ఆకట్టుకున్నాడు. తను ఏ పాత్ర చేసినా దాంతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తాడని అందరూ ఫిక్స్ అయిపోయారు. అలా తన యాక్టింగ్‌పై అందరికీ నమ్మకం వచ్చింది. ఇప్పటికే తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించిన మాలీవుడ్‌లో మాత్రం ఇటీవల అడుగుపెట్టాడు. పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ‘గురువాయుర్ అంబలనడయుల్’ మూవీలో క్లైమాక్స్‌లో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్’తో తను తెలుగులో కూడా అడుగుపెట్టనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
Im fine all. This is false news pic.twitter.com/EwO3MB3T2Q
— Yogi Babu (@iYogiBabu) February 16, 2025