Maha Kumbh Mela: మనదేశంలో ప్రతి ఏటా కుంభమేళా జరుగుతుందన్న విషయం తెలిసిందే.. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. సామాన్యులతో పాటు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఇక్కడకు వస్తున్నారు. ఇక్కడ పవిత్ర స్నానం ఆచరిస్తే అంతా మంచి జరుగుతుందని అందరూ నమ్ముతారు అందుకే దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి స్నానమాచరిస్తారు.. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన నటీ నటులు పెద్ద ఎత్తున కుంభ మేళాను దర్శించుకుంటున్నారు. ఆ ప్రాంతంలోని అనుభవాలను సోషల్ మీడియ వేదికగా అందరితో పంచుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మలయాళ బ్యూటీ సంయుక్తమేనన్ కుంభమేళాను సందర్శించి అక్కడ పవిత్ర సంఘంలో స్నానమాచరించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఫోటోలు తో పాటు ఆమె.. జీవితంలో విశాలతను మనం కళ్లారా చూసినప్పుడు దానికి మించింది మరోకటి లేదు అనిపిస్తుంది. అనంతమైన స్ఫూర్తి కోసం నా సంస్కృతిని నేను ఎంతో ఆదరిస్తాను. మహా కుంభ మేళాలో భాగంగా గంగా నదిలో పవిత్రమైన స్నానం చేస్తున్నప్పుడు నా మనసు మరింత తేలికపడింది అని రాసుకొచ్చింది. ఆమె రాసిన క్యాప్షన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. దాంతో ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి..
సంయుక్త సినిమాల విషయానికొస్తే… మలయాళ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. సినిమాతోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది. ఆ మూవీ మంచి హిట్ టాక్ని అందుకోవడంతో ఆ తర్వాత వరుస అవకాశాలు అమ్మడుకు వెతుక్కుంటూ వచ్చాయి.. తర్వాత మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సరసన విరూపాక్ష, సార్ సినిమాలు సక్సెస్ అవ్వడంతో అమ్మడు ఇక దూసుకెళ్తుందని అనుకోగా డెవిల్ ఫ్లాప్ తో డీలా పడింది. నెక్స్ట్ సినిమాల అవకాశాలు కూడా మందగించాయి. ఐతే ఈమధ్యనే అఖండ 2లో అమ్మడు ఛాన్స్ దక్కించుకుంది. బాలకృష్ణతో సినిమా అంటే ఆ రేంజ్ వేరేలా ఉంటుంది. సినిమా అంటే ఆ హీరోయిన్ రేంజే వేరని నందమూరి అభిమానులు అంటున్నారు. ఇక సంయుక్త మీనన్ఈ సినిమా బాగా కలిసి వచ్చేలా ఉందని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. వీటితో పాటుగా టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తో స్వయంభు అనే సినిమాలో నటిస్తుంది. తెలుగుతో పాటు సంయుక్తకి తమిళ ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది. ఐతే సంయుక్త మాత్రం తెలుగు సినిమాలు చేయడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.. సినిమాలు పరంగా మంచి సక్సెస్ ని అందుకున్న ఈ హీరోయిన్ పర్సనల్గా తనకు తాను ప్రమోట్ చేసుకోలేక ఉంది సోషల్ మీడియాలో పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేయలేదు. అందుకే ఇక టాప్ గేర్ మార్చి సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యింది. సంయుక్త ప్రస్తుతం చేస్తున్న అన్నీ సినిమాలు మంచి జానర్ లో రాబోతున్నాయి. మరి ఏ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి..
Life unfurls its meaning when we glimpse the vastness beyond it. I cherish my culture for its boundless spirit, ever nourishing the stream of consciousness, like a sacred dip in the Ganga at Mahakumbh. #mahakumbh #prayagraj #kumbhmela #omnamahshivaya pic.twitter.com/7glEvNLG42
— Samyuktha (@iamsamyuktha_) February 4, 2025