Indian Railways Toll Free Number 139: భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నది. ఇందుకోసం పలు టోల్ ఫ్రీ నెంబర్లను పరిచయం చేసింది. ఈ నెంబర్ల ద్వారా ఫిర్యాదులు చేయడంతో పాటు రైల్వే కలిపిస్తున్న పలు సదుపాయాలను పొందే అవకాశం ఉంటుంది. అలాంటి నెంబర్లలో ఒకటి 139 టోల్ ఫ్రీ నెంబర్. ఇండియన్ రైల్వే కొద్ది సంవత్సరాల క్రితమే తీసుకొచ్చింది. అయితే, ఈ నెంబర్ గురించి ప్రయాణీకులలో పెద్దగా అవగాహన లేదు. అందుకే, దీనికి పెద్దగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ప్రయాణీకులు అత్యవసర సమయంలో ఎవరికి సమాచారం ఇవ్వాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.
139 టోల్ ఫ్రీ నెంబర్ గురించి రైల్వే ముమ్మర ప్రచారం
ప్రయాణీకులకు అత్యవసర సమయాల్లో అందే సేవల గురించి రైల్వే అధికారులు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 139 టోల్ ఫ్రీ నంబరు ఉపయోగాలను ప్రయాణికులకు వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. రైల్వే కోచ్ లలో క్యూఆర్ కోడ్ కూడిన స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మొబైల్ యాప్ లోకి వెళ్లి సింఫుల్ గా కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో అసవరమైన సేవలను పొందేలా చేస్తున్నారు. ప్రయాణీకులు 139 నంబర్ కు డయల్ చేయగానే నేరుగా ఆ కాల్ కంట్రోల్ రూమ్ కి చేరుతుంది. కంప్లైంట్ తీసుకోగానే సమాచారం ఇచ్చిన ప్రయాణీకులు ఎక్కడున్నారనే విషయాన్ని గుర్తిస్తారు. వెంటనే ప్రయాణీకులు చేరుకునే సమీప రైల్వేస్టేషన్ లోని రైల్వే సిబ్బందికి సమాచారం అందిస్తారు. అక్కడున్న సిబ్బంది స్పందించి రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే ఫిర్యాదు ఇచ్చిన కోచ్ దగ్గరికి సిబ్బంది వెళ్లి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు.
Read Also: 57 రైళ్లకు హాల్టింగ్, తెలుగు ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఏ ఏ స్టేషన్లలో ఆగుతాయో తెలుసా?
139 టోల్ ఫ్రీ నెంబర్ తో పొందే సేవలు ఇవే!
టోల్ ఫ్రీ నెంబర్ తో రైల్వేకు సంబంధించిన బోలెడు సర్వీసులు అందించే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఈ నెంబర్ ద్వారా ఏ సేవలు పొందగలమో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ ప్రమాద సమయంలో తక్షణ సమాచారం
⦿ రైల్వే సిబ్బంది సరిగా సేవలు అందించకపోవడం
⦿ రైల్వే కోచ్ లలో ప్రమాదం జరగడం
⦿ రైలులో సాంకేతిక లోపాలు
⦿ రైలులో టాయిలెట్స్ సరిగా లేకపోవడం, సౌకర్యాలు ఉండకపోవడం
⦿ సరుకు రవాణా, పార్సిల్ సమాచారం
⦿ ఎమర్జెన్సీ మెడికల్ హెల్ప్
⦿ ప్రయాణీకుల భద్రత
⦿ ఉద్యోగులు, సిబ్బంది పని సరిగాలేకపోతే ఫిర్యాదు చేయండ
⦿ కేటరింగ్ సదుపాయాలు పొందడం
⦿ టికెట్ క్యాన్సిలేషన్
⦿ రైల్వే స్టేషన్లలో వీల్ చైర్ బుకింగ్
⦿ చిన్నారుల సంరక్షణ
⦿ లగేజీ దొంగతనంపై ఫిర్యాదులు
రైల్వే సంస్థ 139 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అందిస్తున్న సేవలను ప్రయాణీకులు వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ఇప్పటికే ఈ నెంబర్ గురించి ప్రయాణీకులలో అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రాత్రి వేళల్లో ఈ నెంబర్ ద్వారా ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
Read Also: అర్జెంట్ గా రైల్లో వెళ్లాలా? డోంట్ వర్రీ.. 5 నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు!