Sundeep Kishan: తెలుగు కుర్ర హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల మీద ఆసక్తితో సందీప్.. చిన్న చిన్న పాత్రలు, సెకండ్ హీరో పాత్రలు చేస్తూ కెరీర్ ను మొదలుపెట్టాడు. కొద్దికొద్దిగా హీరోగా మారుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. మంచి మంచి కథలను ఎంచుకొని టైర్ 2 హీరోగా మారాడు. ఇక నిర్మాతగా కూడా మారి.. కొన్ని సినిమాలను నిర్మించాడు.
ఇవన్నీ పక్కన పెడితే.. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా కన్నా నటుడిగానే ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా కోలీవుడ్ లో సందీప్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. మైఖేల్ సినిమా నుంచి సందీప్ చూపు మొత్తం కోలీవుడ్ మీదనే ఉంది. ఆ తరువాత తమిళ్ లోనే స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ కనిపిస్తున్నాడు. ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్, రాయన్ సినిమాల్లో సందీప్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
Sambarala Yeti Gattu: మెగా మేనల్లుడు అనుకున్న టైటిల్ తోనే వచ్చేస్తున్నాడు
ముఖ్యంగా రాయన్ సినిమాలో పీచు మిఠాయ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మధ్యలో తెలుగులో ఊరి పేరు భైరవకోన అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్నే అందుకుంది. ప్రస్తుతం ఒకపక్క తెలుగు సినిమాలు .. ఇంకోపక్క తమిళ్ సినిమాలతో సందీప్ బిజీగా మారాడు. తాజాగా సందీప్.. సూపర్ స్టార్ రజినీకాంత్ తో నటించే ఛాన్స్ పట్టేశాడు.
ప్రస్తుతం రజినీ నటిస్తున్న చిత్రాల్లో కూలీ ఒకటి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సందీప్ కూడా కీలకపాత్రలో నటిస్తున్నాడు. నేడు రజినీ పుట్టినరోజు కావడంతో కూలీ సెట్ లో రజినీతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. తలైవాకు బర్త్ డే విషెస్ తెలిపాడు.
Sai Durga Tej – Ram Charan : స్టేజ్ పైనే సాయి తేజ్ ను టీజ్ చేసిన రామ్ చరణ్
“హ్యాపీ బర్త్ డే తలైవా.. లవ్ యూ. మీరు మా తరానికి స్పూర్తిగా నిలిచినందుకు ధన్యవాదములు. లోకేష్ మీరు చూపించిన ప్రేమకు, ఆప్యాయతకు, ఆశీర్వాదాలకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. కింద నోట్ లో కూలీ మంటలు రేపుతుంది అంటూ రాసుకొచ్చి ఇంకా ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేశాడు. ఇక నేడు రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి చికిటు వైబ్ అనే వీడియోను రిలీజ్ చేశారు.
ఇక ఆ షూట్ సమయంలోనే సందీప్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఆ సాంగ్ లో రజినీతో సందీప్ కూడా డ్యాన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు.. సూపర్.. రజినీతో నటించడం అద్భుతం అని చెప్పుకొస్తున్నారు. ఇంకోపక్క ఇలా సపోర్టివ్ రోల్స్ కాకుండా హీరోగా కూడా చేయ్ అన్నా అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
ఇది కాకుండా తమిళ్ స్టార్ హీరో విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ ఒక సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా అధికారికంగా ప్రకటించనున్నారు. మరి ఈ సినిమాలతో సందీప్ కిషన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Happy Birthdayyy Thalaiva …
Love you ♥️
Blessed to Have you as the Inspiration for our Generation …
Thank you for the Love , Kindness & Blessings ..♥️
Proudest as always of my @Dir_LokeshPS : Coolie will be 🔥#HappyBirthdaySuperstar pic.twitter.com/uOyJkVPbOf
— Sundeep Kishan (@sundeepkishan) December 12, 2024