Mowgli Movie :రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియా ఎంతగా చాలామందికి ఉపయోగపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాయ్ బిస్కెట్ అని వెబ్సైట్లో ముందు ఆర్టికల్స్ రాస్తూ, అలానే అదే యూట్యూబ్ ఛానల్ కి చాలా షార్ట్ ఫిలిమ్స్ తెరకెక్కించాడు సందీప్ రాజ్. కలర్ ఫోటో సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. సుహాస్, చాందిని చౌదరి కలిసిన నటించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు కరోనా కారణంగా చాలా థియేటర్స్ మూతపడ్డాయి. డైరెక్ట్ గా ఈ సినిమా ఓటీటీ లో రిలీజ్ అయింది.
ఈ సినిమాకు సాయి రాజేష్ కథ అందించాడు, కేవలం కథ అందించడం మాత్రమే కాకుండా సాయి రాజేష్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమాకి విపరీతమైన రెస్పాన్స్ తో పాటు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమా తర్వాత దర్శకుడుగా సందీప్ రాజ్ ఇప్పటివరకు ఒక సినిమా కూడా చేయలేదు. ముఖచిత్రం అనే ఒక సినిమాకు మాత్రం కథను అందించాడు. ఆ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. ఇక ప్రస్తుతం సందీప్ రాజ్ దర్శకుడుగా ఒక సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.
సుమ కనకాల కొడుకు రోషన్ కనకల హీరోగా సందీప్ రాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా విజయ్ సేతుపతి నటించిన మహారాజ సినిమాలో విలన్ గా కనిపించి మెప్పించాడు అనురాగ్ కశ్యప్. అనురాగ్ కశ్యప్ లాంటి ఒక బాలీవుడ్ దర్శకుడు రోషన్ సినిమాలో విలన్ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు అని అంటే అది ఎంత పవర్ఫుల్ గా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. ఈ సినిమాకి సంబంధించిన ముహూర్తం రేపు జరగనుంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో పీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
Also Read : Pushpa 2: బంగారం లాంటి సీన్ డిలీట్ చేసి పడేశారు కదరా.. ఇది కనుక ఉండి ఉంటేనా.. ?
The stage is set for #Mowgli‘s Muhurtham ❤️🔥
Beginning the exciting adventure with an auspicious pooja ceremony on 19th December ✨#Mowgli2025 shoot begins soon. Stay tuned for more updates.
A @SandeepRaaaj directorial 💥
🌟ing @RoshanKanakala
A @kaalabhairava7 musical 🎵… pic.twitter.com/qcYYSmiMdM— People Media Factory (@peoplemediafcy) December 18, 2024