BigTV English

Pushpa 2: బంగారం లాంటి సీన్ డిలీట్ చేసి పడేశారు కదరా.. ఇది కనుక ఉండి ఉంటేనా.. ?

Pushpa 2: బంగారం లాంటి సీన్ డిలీట్ చేసి పడేశారు కదరా.. ఇది కనుక ఉండి ఉంటేనా.. ?
Advertisement

Pushpa 2: పుష్ప.. పుష్ప.. పుష్ప రాజ్.. ఈ ఏడాది అంతా అందరు అల్లు అర్జున్ నమ జపం చేస్తున్నారు.  ఏడాది మొదట్లో వివాదాల వలన వైరల్ అయ్యాడు.. డిసెంబర్ 4 నుంచి పుష్ప 2 ద్వారా  వైరల్ గా మారాడు బన్నీ.  స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో  తెరకెక్కిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 ను రిలీజ్ చేశారు. బన్నీ వివాదాల నేపథ్యంలో ఈ సినిమాను ఎవరు  చూస్తారు.. ?  నెగెటివ్ టాక్ వస్తుంది.. సినిమా కు అంత సీన్ లేదు.. ఇలా పుష్ప 2 రిలీజ్ కు ముందు ఎన్నో మాటలు అన్నారు.  కానీ, సినిమా రిలీజ్ అయ్యాకా నీయవ్వ తగ్గేదేలే అని మాత్రమే చెప్పుకొస్తున్నారు.


కొంతమంది నచ్చలేదు అన్నా కూడా  అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం సినిమాను విజయ పంథాలో  నడిపించారు. ఇప్పటివరకు పుష్ప 2 రికార్డ్  కలక్షన్స్ చూస్తే ఇంతకు ముందు ఏ సినిమా  కూడా వసూలు చేయలేదని చెప్పాలి. ఇప్పటివరకు  పుష్ప 2 రూ. 1292 కోట్లు రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. అంతేకాకుండా హిందీలో కూడా  ఏ బాలీవుడ్ సినిమా కూడా కలెక్ట్  చేయనంత కలక్షన్స్ ను రాబట్టి.. తెలుగు సినిమా సత్తా చాటింది.

Allu Arjun: పవన్ కళ్యాణ్ బాటలో స్నేహారెడ్డి.. ఏకంగా 41 రోజులు..


హిందీ వెర్షన్ లో ఏకంగా 600 కోట్ల క్లబ్ లోకి పుష్ప 2 చేరిపోయి సెన్సేషనల్ ఫీట్ సాధించింది. ఇంకా పుష్ప 2 వసూళ్ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇకపోతే వచ్చే నెలలో ఈ సినిమా  ఓటీటీలోకి వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు మేకర్స్  అధికారికంగా ప్రకటించలేదు. అయితే రెండు రోజులుగా ఈ సినిమాలోని వీడియో సాంగ్స్ ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. నిన్నటికి నిన్న వస్తున్నాయి పీలింగ్స్ సాంగ్ ను రిలీజ్ చేయగా.. నేడు పుష్ప సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ లో పుష్ప క్యారెక్టర్ ను బాగా ఎస్టాబ్లిష్  చేశారు. పుష్ప యాటిట్యూడ్ ని చాలా చక్కగా చూపించారు.

అయితే ఈ సాంగ్ లో థియేటర్ లో రిలీజ్ చేయని ఒక సీన్ ను కూడా యాడ్ చేశారు. ట్రైలర్ లో పుష్ప.. క్రికెట్ కప్ ముందు కూర్చొని కనిపించిన షాట్ ను సినిమాలో పెట్టలేదు. చిన్నతనంలో క్రికెట్ ఆడనివ్వకుండా ఫ్రెండ్స్ హేళన చేసిన సీన్ ను సినిమా ఫస్ట్ లోనే చూపించారు. ఇక పుష్ప పెద్దయ్యాకా.. డబ్బులు సంపాదించాకా..  ఆ గ్రౌండ్ లోనే చిన్న పిల్లలతో క్రికెట్ ఆడించి కప్ అందిస్తాడు.

Jack Movie: రాజాసాబ్ తోనే ఢీ కొడుతున్నావా టిల్లు.. ఆ ధైర్యంతోనేనా.. ?

ట్రైలర్ రిలీజ్ అయ్యాకా ఈ షాట్స్ చాలా హైప్ ను తీసుకొచ్చి పెట్టాయి. కానీ, సినిమాలో లేకపోయేసరికి అందరి చాలా అసహనం వ్యక్తం చేశారు. ఇక ఆ డిలేటెడ్ సీన్స్ ను పుష్ప వీడియో సాంగ్ లో యాడ్  చేశారు.  దీంతో ఈ సాంగ్ చూసిన వారందరూ.. బంగారం లాంటి సీన్ డిలీట్ చేసి పడేశారు కదరా.. ఇది కనుక ఉండి ఉంటేనా.. థియేటర్ లో విజిల్స్ వేరే లెవెల్ లో ఉండేవి అని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.

Tags

Related News

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Big Stories

×