Prabhas’s Spirit Movie :సాధారణంగా ఒక డైరెక్టర్ సినిమా తెరకెక్కించేటప్పుడు హీరోలు.. ఆ డైరెక్టర్ తో షూటింగ్లో పాల్గొంటూనే.. ఇంకో డైరెక్టర్ సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటూ తమ సమయాన్ని వృధా చేయకుండా ఒకేసారి సినిమాలను విడుదల చేయాలని చూస్తుంటారు. కానీ కొంతమంది దర్శకులు వేరే. తమ విజన్ వేరే ఉంటుంది. అందుకే తమ సినిమాలలో హీరోలు తాము అనుకున్నట్టుగానే ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కూడా ఒకరు. ఈ నేపథ్యంలోనే తన సినిమాలో ప్రభాస్ నటించిన కొన్ని షరతులు పెట్టారట. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.
రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్న ప్రభాస్..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా భారీ గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న ఏకైక స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) అనడంలో సందేహం లేదు. ఒక సినిమా సెట్ మీద ఉండగానే ఇంకో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జెడ్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు రాజా సాబ్(Raja saab), ఫౌజీ (Fauji) సినిమా షూటింగ్లలో పాలు పంచుకుంటూ ఒకేసారి రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు ప్రభాస్.. అటు కల్కి 2 ఎప్పుడైనా మొదలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ‘స్పిరిట్’ సినిమా కూడా సిద్ధంగా ఉంది. ఇక చేతిలో ఒకేసారి ఇన్ని ప్రాజెక్టులు పెట్టుకొని అన్నింటికీ కూడా డేట్లు కేటాయిస్తూ.. జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న ప్రభాస్ కి రెస్టు లేకుండా పని చేయడం అలవాటైపోయింది. కానీ మిగతా డైరెక్టర్ల సంగతి పక్కన పెడితే.. స్పిరిట్ విషయంలో మాత్రం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చాలా స్ట్రాంగ్ కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.
ప్రభాస్ కి కండిషన్ పెట్టిన సందీప్..
అసలు విషయంలోకి వెళ్తే.. స్పిరిట్ సినిమా చేస్తున్నప్పుడు ప్రభాస్ ఇంకో సినిమా చేయకూడదని, ఫుల్ టైం స్పిరిట్ కేటాయించాలని కూడా చెప్పాడట. ఎందుకంటే స్పిరిట్ లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. కాబట్టి పాత్రకి తగ్గట్టుగా బాడీ కూడా బిల్డ్ చేయాల్సి ఉంటుంది. పైగా ఆయన లుక్ బయటకు వెళ్లకూడదని సందీప్ బలంగా భావిస్తున్నాడట. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఒకసారి సినిమా షూటింగ్ మొదలు పెట్టారంటే.. ఏక ధాటిగా పనిచేసి ప్రాజెక్టు ఫినిష్ చేస్తానని, అప్పటివరకు స్పిరిట్ మూడ్ లోనే మీరు ఉండాలని ప్రభాస్ తో చెప్పారట సందీప్. ఇక అందులో భాగంగానే స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ లోగా ప్రభాస్ ని కూడా తన ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసుకోమని కూడా చెప్పారట . వాస్తవానికి సందీప్ స్టైల్ మిగతా దర్శకుల కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా పూర్తి డెడికేషన్ తో పనిచేస్తాడు. పైగా తన టీమ్ లో కూడా అలాంటి వాళ్లే ఉండాలని కోరుకుంటాడు. ఇక ప్రభాస్ మాత్రమే కాదు ఆయన సినిమాలో నటించే ఎంత పెద్ద స్టార్స్ అయినా సరే సందీప్ కు అవన్నీ అవసరం లేదు. తనకంటూ ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ ప్రకారమే ఆయన పని చేయాలని కోరుకుంటాడు. అంతేకాదు తనతో పాటు తన సినిమాలో పనిచేసే వాళ్లు కూడా అలాగే ఉండాలని ఆలోచించే వ్యక్తి సందీప్. ఇక ప్రస్తుతం ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. పైగా ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాల కంటే కూడా స్పిరిట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సందీప్ ప్రభాస్ కి దారి లేకుండా చేసి బ్లాక్ చేసేసాడు. ఇక చేసేదేమి లేక ప్రభాస్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం.