Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగ… ప్రస్తుతం ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. పాన్ ఇండియా మొత్తం ఏ స్టార్ హీరో అయినా సందీప్ రెడ్డి వంగ సినిమా చేస్తాను అంటే డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అంటే ఆయన రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఓపెన్ మైండ్ తో, ప్యూర్ ఎమోషన్స్ తో, హానెస్ట్ గా సినిమాలు చేసే సందీప్ రెడ్డి వంగ అనిమల్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. అనిమల్ సినిమా బాలీవుడ్ వాళ్లకి షాక్ వేవ్ లా తగిలింది అంటే దాని ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. మోస్ట్ వయోలెంట్ ఫిల్మ్ గా అనిమల్ రిలీజ్ అవ్వడంతో ఆడియన్స్ మూవీని థియేటర్ లో చూసి ఎంజాయ్ చేసారు కానీ క్రిటిక్స్ మాత్రం నెగటివ్ కామెంట్స్ తో రెచ్చిపోయారు.
ఏ క్రిటిక్ ఏ కామెంట్ చేసినా సందీప్ రెడ్డి వంగ స్ట్రాంగ్ రిప్లై ఇస్తూ కౌంటర్లు ఇచ్చాడు. నా సినిమా ఇలానే ఉంటుంది, డైరెక్టర్ గా నాకు నచ్చిన సినిమా చేసే ఫ్రీడమ్ నాకుంది, అది ఆడియన్స్ కి కూడా నచ్చుతుంది ఇక ఈ మధ్యలో క్రిటిక్స్ గా నెగటివ్ కామెంట్స్ చేయడానికి మీరెవరు అంటూ సందీప్ రెడ్డి వంగ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. టాలీవుడ్ లో ఆపితే బాలీవుడ్, బాలీవుడ్ లో ఆపితే హాలీవుడ్… ఎక్కడికి వెళ్ళినా సినిమానే చేస్తా అంటూ సందీప్ రెడ్డి వంగ క్లారిటీ ఇచ్చేసాడు.
ఈమధ్య కాలంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సందీప్ రెడ్డి వంగలాంటి డైరెక్టర్ ని అయితే చూడలేదు, ఇకపోతే ఈ సెన్సేషనల్ డైరెక్టర్, కెప్టెన్ కూల్ ధోనితో కలిసి ఒక యాడ్ చేసాడు. క్లీన్ ఇమేజ్ ఉన్న ధోనిని అనిమల్ స్టైల్ లోకి మార్చి చేసిన ఈ యాడ్ ఒక ఎలక్ట్రిక్ సైకిల్ గురించి, త్వరలో రిలీజ్ అవనున్న సైకిల్ గురించి యాడ్ చేస్తే ధోనికి లాంగ్ హెయిర్ పెట్టి కొత్తగా కనిపించేలా చేసాడు సందీప్. ధోని కూడా అనిమల్ సినిమాలోని డైలాగ్స్ చెప్పి ఫ్యాన్స్ ని ఖుషి చేసాడు. అయితే అనిమల్ సినిమా ఎండ్ షాట్ లో రణబీర్ కపూర్ ఒక హ్యాండ్ గెస్చర్ చేస్తాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు షాక్ అయిన ఆ గెస్చర్ ని ధోని కూడా చేయించాడు సందీప్ రెడ్డి వంగ. యాడ్ వీడియో బయటకి రావడంతో, లాస్ట్ షాట్ లో ధోనిని చూసి అందరూ షాక్ అవుతున్నారు. సందీప్ రెడ్డి వంగ గురించి తెలిసిన తెలుగు మూవీ లవర్స్ మాత్రం, ఈయన ధోనిని కూడా వదల్లేదు అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.