Bhadrachalam SreeRama Swamy Talambralu Delivery: శ్రీ రామనవమి పండుగ సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది కూడా భద్రాచలంలో శ్రీరామనవమి పండుగ కన్నుల పండుగగా జరపనున్నారు. అయితే కల్యాణోత్సవం దగ్గరుండి తిలకించని వారి కోసం, భద్రాచలం వెళ్లలేని భక్తుల కోసం శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) సిద్ధమైంది. ఇందుకోసం భక్తులు జస్ట్ రూ. 151 చెల్లిస్తే సరిపోతుందని టీజీఎస్‌ఆర్టీసీ తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ALSO READ: SBI Recruitment: రూ.1,00,000 జీతంతో SBIలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేది ఇదే..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) సోమవారం రోజున హైదరాబాద్‌లోని TGSRTC బస్ భవన్‌లో భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు బుకింగ్ పోస్టర్‌ను ఆవిష్కరించింది. ఈ కార్యక్రమం శ్రీరామనవమికి ముందు భక్తుల ఇంటికి డెలివరీ చేసే పవిత్ర తలంబ్రాల బుకింగ్‌లను అధికారికంగా ప్రారంభించింది.
ఈ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ సహకారంతో, భద్రాది సీతారామచంద్ర కల్యాణ తలంబ్రాలను స్వీకరించాలని అనుకునే భక్తులకు టీజీఎస్ఆర్టీసీ సంస్థ హోం డెలివరీ చేస్తుందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. భద్రాచలంలో ఏప్రిల్ 6న అంగరంగ వైభవంగా జరిగే శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవ వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.
భక్తులు రాముల వారి తలంబ్రాలు కోసం జస్ట్ రూ. 151 చెల్లిస్తే సరిపోతుందని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ చెప్పారు. తలంబ్రాలు స్వీకరించడానికి ఆసక్తిగా ఉన్న భక్తులు TGSRTC లాజిస్టిక్స్ సెంటర్లలో లేదా tgsrtclogistics.co.in వెబ్‌సైట్ ద్వారా ₹151 చెల్లించి నమోదు చేసుకోవచ్చని అన్నారు. శ్రీ సీతారామచంద్ర కల్యాణోత్సవం తర్వాత, తలంబ్రాలు రిజిస్టర్డ్ చిరునామాలకు డెలివరీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ముఖ్యంగా వచ్చే నెల 6న భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకులకు హాజరు కాలేని భక్తులకు కోసం ఈ సేవలు ప్రారంభిస్తున్నామని సజ్జనార్ చెప్పారు. తలంబ్రాలు కోసం బుకింగ్‌లు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని లాజిస్టిక్స్ కౌంటర్లలో.. అలాగే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని ఆయన తెలిపారు. శ్రీ రాముల వారి తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీజీఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్ 040-69440069, 040-69440000 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో TGSRTC CEO వి. రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్, చీఫ్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజర్ శ్రీధర్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: CISF Recruitment: టెన్త్‌తో 1161 పోలీస్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకున్నారా మిత్రమా..?