BigTV English
Advertisement

Allu Arjun Remand : అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

Allu Arjun Remand : అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్(Allu Arjun)తాజాగా అరెస్ట్ అయిన విషయం అటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. డిసెంబర్ 4వ తేదీన జరిగిన సంఘటనలో భాగంగా అల్లు అర్జున్ ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అల్లు అర్జున్ ను నాంపల్లి కోర్టులో విచారణకు హాజరుపరచగా కోర్టు తీర్పునిస్తూ 14 రోజులపాటు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చెయ్యని తప్పుకు 14 రోజులు రిమాండ్ అంటే.. అందులోనూ ఒక స్టార్ హీరో రిమాండ్ కి తరలించనున్నారు అని తెలియడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. అంతేకాదు దీనిపై బన్నీ అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో అంటూ సినీ ఇండస్ట్రీ మొత్తం అటువైపు చూస్తోంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున ర్యాలీలు, అల్లర్లు జరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం.


14 రోజులు జైల్లోనే..

అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar) కాంబినేషన్లో వచ్చిన పుష్ప(Pushpa)సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా లభించింది. ఈ సినిమా సీక్వెల్ గా దాదాపు మూడేళ్ల కష్టం తర్వాత ‘పుష్ప -2’ సినిమా విడుదల చేశారు. అయితే విడుదలైన తర్వాత కష్టానికి ప్రతిఫలం లభించింది. ఐదు రోజుల్లోనే రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఆ ఆనందం మాత్రం ఒక్కరోజు కూడా నిలవలేదని చెప్పాలి. తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ అవడంతో ఆయనకు బెయిల్ తీసుకొచ్చే ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. కానీ నాంపల్లి కోర్టులో విచారణ జరపగా 14 రోజులు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. దీన్నిబట్టి చూస్తే ఈరోజు నుంచి 14 రోజుల వరకు అల్లు అర్జున్ జైలు జీవితం గడపబోతున్నారు. అటు అల్లు అరవింద్ (Allu Aravindh), ఇటు చిరంజీవి(Chiranjeevi)ఎంతగానో ప్రయత్నం చేశారని , కానీ బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఏది ఏమైనా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ఇప్పుడు జైలు జీవితం గడవబోతున్నారని తెలిసి అభిమానులు సైతం ఈ షాక్ నుంచి కోలుకోలేకపోతున్నట్లు సమాచారం.


అసలేం జరిగిందంటే..?

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 2 డిసెంబర్ 4వ తేదీన బెనిఫిట్ షోలు వేశారు. హైదరాబాదులోని సంధ్యా థియేటర్లో సినిమా చూడడానికి పెద్ద ఎత్తున ఆడియన్స్ వచ్చారు. అయితే అదే రోజు ఆ థియేటర్లో సినిమా చూడడానికి అల్లు అర్జున్ కూడా వచ్చారు. అల్లు అర్జున్ ని చూడడానికి అభిమానులు ఎగబడగా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో 39 సంవత్సరాల రేవతి అనే మహిళ అక్కడికక్కడే మరణించగా.. ఆమె కొడుకు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. సీపీఆర్ చేసినా సరే ఫలితం లేకపోవడంతో బాలుడిని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం బాలుడు పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన పైన అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు. అయితే ఈ విషయంపై స్పందించిన రేవతి భర్త భాస్కర్ మాత్రం.. అల్లు అర్జున్ ఇప్పుడు అరెస్టు కావడానికి తనకు ఎటువంటి సంబంధం లేదని, అల్లు అర్జున్ పై పెట్టిన కేసును తాను విత్డ్రా చేసుకుంటానని కూడా చెబుతున్నారు. ఏది ఏమైనా జరగాల్సిన నష్టం జరిగిందని ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×