Vinod Kambli: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన సచిన్ టెండుల్కర్ ప్రియమిత్రుడిగా కూడా అందరికీ సుపరిచితమే. అంతేకాదు ఈయన క్రికెట్ అరంగేట్రంలో సచిన్ కంటే బెస్ట్ బ్యాటర్ గా కితాబులందుకున్నాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ 90వ దశకంలో ఓ వెలుగు వెలిగాడు. కానీ అదే ఫామ్ ని కొనసాగించలేకపోయాడు. దీంతో తక్కువ కాలంలోనే జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో కాంబ్లీకి {Vinod Kambli} కి విభేదాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. అయితే ఈ విభేదాలపై తాజాగా వినోద్ కాంబ్లీ మనసు విప్పాడు.
Also Read: Mohammad Shami: మహమ్మద్ షమీ, రోహిత్ శర్మ మధ్య చిచ్చు పెడుతున్న పాకిస్తాన్?
2009లో సచిన్ ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే విభేదాలు వచ్చాయని తెలిపాడు. ” సచిన్ ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నిజానికి 2013లో సర్జరీ సమయంలో మెడికల్ బిల్స్ ని అతడే చెల్లించాడు. ఓ దశలో సచిన్ నా కోసం ఏం చేయలేదని అనిపించింది. కానీ సచిన్ నాకోసం ఎన్నో చేశాడు. రెండు సర్జరీలు జరిగినప్పుడు బిల్లు మొత్తం అతడే చెల్లించాడు. మేమిద్దరం మాట్లాడుకున్నాం. మా చిన్ననాటి స్నేహం మళ్లీ మొదలైంది. కెరీర్ ప్రారంభంలో ఎలా ఆడాలో సచిన్ నాకు చెప్పేవాడు.
నేను తొమ్మిది సార్లు జట్టులోకి కం బ్యాక్ చేశా. క్రికెటర్లకు గాయాలు తప్పవు. వాటిని తట్టుకొని ముందుకు వెళ్లిన వారే నిలబడతారు. అలాగే టీం నుండి బయటకు వెళ్తూ ఉంటాం. నేను వాంఖడే వేదికగా చేసిన డబుల్ సెంచరీని ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సమయంలో ఆచ్రేకర్ సర్ నాతో ఉండేవారు. క్రికెట్ లో ముత్తయ్య మురళీధరన్ తో పోటీ పడేవాణ్ణి. ఆయనతో పోటీ సరదాగా ఉండేది. మొత్తానికి నా క్రికెట్ ప్రయాణం సరిగ్గా జరగలేదు. కానీ నాకు సచిన్ వంటి స్నేహితుడు ఎంతో అండగా నిలిచాడు. ఇక నా కుటుంబ మద్దతు చెప్పలేనిది” అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక వినోద్ కాంబ్లీ {Vinod Kambli} తొలిసారిగా భారత జట్టులోకి 1991లో షార్జాలో జరిగిన వన్డే మ్యాచ్ తో భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. 1991 – 2010 అంతర్జాతీయ క్రికెట్ లో 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. 17 టెస్టుల్లో 54 సగటుతో 1084 పరుగులు చేశాడు. 14 వన్డేల్లో రెండు సెంచరీలతో పాటు.. 14 ఆఫ్ సెంచరీలు చేశాడు. ఇక వినోద్ కాంబ్లీకి అనారోగ్య సమస్యలు ఉన్న విషయం తెలిసిందే. కెరీర్ ఫెయిల్యూర్, తదితర కారణాలతో తీవ్ర డిప్రెషన్ కి వెళ్ళాడు. 2012లో కంబ్లీ యాంజియోప్లాస్టి చేయించుకున్నాడు.
Also Read: Gautam Gambhir: టీమిండియా ఓటమికి కుట్రలు..గంభీర్ పై ట్రోలింగ్ ?
ఇక 2013లో కాంబ్లీ కారు నడుపుతూ గుండెపోటుకు గురయ్యాడు. ఇక ఇప్పుడు తన పరిస్థితి బాగానే ఉందని చెప్పుకొచ్చాడు కాంబ్లీ. తనని చూసేందుకు అజయ్ జడేజా వచ్చాడని.. దీంతో తనకి చాలా ఆనందంగా ఉందన్నాడు. తన భార్య తన గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని, మూడు ఆసుపత్రిలో చూపించి మరీ వైద్యం చేయించిందన్నాడు. తన కుమారుడు, కుమార్తె సైతం తనకు ఎంతగానో సాయం గా నిలిచారని పేర్కొన్నాడు. అయితే తాను ప్రస్తుతం ఎన్నో ఆర్థిక కష్టాలలో ఉన్నట్లు తెలిపాడు వినోద్ కాంబ్లీ.